Roshan Meka: రోషన్ హీరోగా స్పై థ్రిల్లర్ మూవీ.. హిట్ దర్శకుడు హిట్ ఇస్తాడా!

టాలీవుడ్ యంగ్ హీరో రోషన్ మేక(Roshan Meka) తన నెక్స్ట్ సినిమాను దర్శకుడు శైలేష్ కొలనుతో చేయడానికి రెడీ అవుతున్నాడు.

Roshan Meka: రోషన్ హీరోగా స్పై థ్రిల్లర్ మూవీ.. హిట్ దర్శకుడు హిట్ ఇస్తాడా!

Young hero Roshan Meka doing his next movie with director Sailesh Kolanu.

Updated On : January 3, 2026 / 10:55 AM IST
  • ఛాంపియన్ హిట్ జోష్ లో రోషన్
  • దర్శకుడు శైలేష్ తో కొత్త సినిమా
  • రా ఏజెంట్ గా సరికొత్తగా

Roshan Meka: ఛాంపియన్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు యంగ్ హీరో రోషన్ మేక. పీరియాడికల్ డ్రామాగా వచ్చిన ఈ సినిమాలో తన నటనతో ఆడియన్స్ ను ఒక రేంజ్ లో ఆకట్టుకున్నాడు రోషన్. చూడాటానికి హాలీవుడ్ స్టార్ లా ఉండే రోషన్ స్క్రీన్ ప్రెజెన్స్ చాలా బాగుంది అంటూ క్రిటిక్స్ సైతం ప్రశంసలు కురిపిస్తున్నారు. అందుకే, రోషన్ తరువాతి సినిమాలపై మంచి హైప్ క్క్రియేట్ అయ్యే అవకాశం ఉంది.

కాబట్టి, తన సినిమాల లైనప్ ని పర్ఫెక్ట్ గా సెట్ చేసుకోవాలి రోషన్(Roshan Meka). ఇందులో భాగంగానే రోషన్ నెక్స్ట్ సినిమా గురించి ఒక ఆసక్తికరమైన న్యూస్ ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. అదేంటంటే, రోషన్ తన నెక్స్ట్ సినిమాను స్పై థ్రిల్లర్ జానర్లో చేయనున్నాడట. ఈ చిత్రాన్ని దర్శకుడు శైలేష్ కొలను తెరకెక్కించనున్నాడు అని నిర్మాత నాగ వంశీ ఇప్పటికే చెప్పేశాడు.

ఈ సినిమాకి అదే సెంటిమెంట్.. మా జోడి కూడా అదే మాదిరి.. పక్కా హిట్టు అంటున్న డింపుల్

దర్శకుడు శైలేష్ గురించి కొత్తగా పరిచయం అవసరం లేదు. ‘హిట్’ సిరీస్ తో ఆడియన్స్ లో తన మార్క్ క్రియేట్ చేసుకున్నాడు ఈ దర్శకుడు. రీసెంట్ గా నానితో చేసిన హిట్ల థర్డ్ కేస్ కూడా బ్లాక్ బస్టర్ అయ్యింది. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర రూ.100 కోట్లకు పైగా గ్రాస్ కలక్షన్స్ రాబట్టి శైలేష్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. అలాంటి దర్శకుడు ఇప్పుడు రోషన్ తో సినిమా చేయడం అంటే హైప్ ఒక రేంజ్ లో ఉంటుంది.

ఇక ఈ ప్రాజెక్టు కోసం కూడా తనకు అచ్చోచ్చిన థ్రిల్లర్ జానర్ నే ఎంచుకున్నాడు దర్శకుడు శైలేష్. కానీ, ఈసారి స్పై థ్రిల్లర్. ఈ సినిమాలో రోషన్ ఏజెంట్ గా కనిపిస్తాడని టాక్. ఈ సినిమా గనుక హిట్ అయ్యింది అంటే రోషన్ టాప్ స్టార్ గా ఎదగడం ఖాయం అంటున్నారు నెటిజన్స్. త్వరలోనే ఈ ప్రాజెక్టు గురించి అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.