Chalaki Chanti effected with Heart attack treatment in Hospital
Chalaki Chanti : నటుడిగా సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చి చిన్న చిన్న అవకాశాలను అందిపుచ్చుకుంటూ సినిమాల్లో క్యారెక్టర్స్ వేశాడు చంటి. జబర్దస్త్(Jabardasth) లో అవకాశం రావడంతో చంటి ఆ అవకాశాన్ని వినియోగించుకొని స్టార్ కమెడియన్ గా ఎదిగాడు. జబర్దస్త్ లో చలాకి చంటి(Chalaki Chanti) పేరుతో స్కిట్స్ వేస్తూ తన కామెడీతో నవ్విస్తూ మంచి కమెడియన్ గా పేరు తెచ్చుకొని అభిమానులని కూడా సంపాదించుకున్నాడు.
చలాకి చంటి జబర్దస్త్ లో నటించడమే కాక, పలు టీవీ షోలకు యాంకరింగ్ కూడా చేశాడు. పలు షోలలో పాల్గొన్నాడు. సినిమాల్లో కూడా నటించాడు. గత సంవత్సరం బిగ్ బాస్ లో పాల్గొన్నాడు చంటి. బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చాక కొన్ని షోలలో పాల్గొన్న చంటి ఇటీవల ఎక్కువగా కనపడట్లేదు.
Sarath Babu : ఇంకా హాస్పిటల్ లోనే శరత్ బాబు.. అత్యంత విషమంగా ఆరోగ్యం..
అయితే కొద్ది రోజుల క్రితం చంటికి తీవ్రమైన హార్ట్ స్ట్రోక్ రావటంతో హాస్పిటల్ తరలించి చికిత్స అందించారట. ఆపరేషన్ చేసి స్టంట్ వేసారని సమాచారం. ప్రస్తుతం అతని అరోగ్యం బానే ఉన్నా ఇంకా పూర్తిగా కోలుకోలేదని సమాచారం. ఇటీవల కొన్ని రోజులుగా చంటి ఏమయ్యాడు అని పలువురు సోషల్ మీడియాలో ప్రశ్నిస్తుంటే తాజాగా చంటి సన్నిహితులు ఈ విషయాన్ని తెలిపారు. చంటికి హార్ట్ స్ట్రోక్ వచ్చిందని, ప్రస్తుతం ఇంకా చికిత్స తీసుకుంటున్నాడని తెలియడంతో అతని అభిమానులతో పాటు జబర్దస్త్ నటులు, పలువురు టీవీ ప్రముఖులు అతను త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు.