Chammak Chandra
Chammak Chandra : చమ్మక్ చంద్ర జూనియర్ ఆర్టిస్ట్ గా కెరీర్ మొదలుపెట్టి అనేక సినిమాల్లో నటించాడు. కానీ సరైన గుర్తింపు జబర్దస్త్ వచ్చేవరకు రాలేదు. జబర్దస్త్ లో గుర్తింపు వచ్చిన తర్వాత సినిమాల్లో కూడా మంచి అవకాశాలు పడ్డాయి. ప్రస్తుతం చమ్మక్ చంద్ర జబర్దస్త్ ని వదిలేసి కేవలం సినిమాలు చేస్తూ అప్పుడప్పుడు పలు టీవీ షోలు చేస్తున్నాడు.
తాజాగా జబర్దస్త్ 12 ఏళ్ళ సెలబ్రేషన్స్ నిర్వహించగా దానికి సంబంధించిన ప్రోమో రిలీజ్ చేసారు. ఈ సెలబ్రేషన్స్ కి పాత టీమ్ లీడర్స్ ని కూడా పిలిచారు. ఈ క్రమంలో చమ్మక్ చంద్ర కూడా వచ్చాడు. అప్పటి లీడర్స్ కి వాళ్ళు తెచ్చిన కమెడియన్స్, వాళ్ళ శిష్యులు పాద పూజ చేసారు.
Also Read : Anchor Ravi : నేను సారీ చెప్పను, చెప్పలేదు.. 1300 మెసేజ్‌లు బూతులు తిడుతూ.. నేను, సుధీర్ ఫోన్ స్విచ్ ఆఫ్..
అనంతరం చమ్మక్ చంద్ర మాట్లాడుతూ.. సినిమాల్లోకి వచ్చాక నాతో పాటు ఉన్నా ధనరాజ్, వేణు ఆర్టిస్టులు అయ్యారు. తాగుబోతు రమేష్ కూడా ఆర్టిస్ట్ అయ్యాడు. నేను మాత్రం ఇంకా అవ్వట్లేదు. ఆ డిజప్పాయింట్మెంట్ లో ఉన్నప్పుడు నాకు జబర్దస్త్ అవకాశం వచ్చింది. ఇది నా లైఫ్ అండ్ డెత్ ప్రోగ్రాం ఒకటే అనుకున్నా అని చెప్తూ తన పాత రోజులను గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ అయ్యాడు.
మీరు కూడా జబర్దస్త్ 12 ఇయర్స్ సెలబ్రేషన్స్ ప్రోమో చూసేయండి..