Anchor Ravi : నేను సారీ చెప్పను, చెప్పలేదు.. 1300 మెసేజ్‌లు బూతులు తిడుతూ.. నేను, సుధీర్ ఫోన్ స్విచ్ ఆఫ్..
తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆ ఘటనపై మాట్లాడుతూ ఈ విషయంలో తను, సుధీర్ ఎంత ఇబంది పడ్డారో తెలిపాడు.

Anchor Ravi
Anchor Ravi : యాంకర్ రవి తన యాంకరింగ్ తో పలు టీవీ షోలలో ప్రేక్షకులను మెప్పిస్తాడు. కానీ అప్పుడప్పుడు పలు వివాదాల్లో కూడా నిలుస్తూ ఉంటాడు. ఇటీవల ఓ టీవీ షోలో సుధీర్ – రవి కలిసి హోస్ట్ చేయగా ఆ షోకి హీరోయిన్ రంభ గెస్ట్ గా వచ్చింది. దీంతో చిరంజీవి బావగారు బాగున్నారా సినిమాలో చిరంజీవి నంది కొమ్ముల నుంచి హీరోయిన్ ని చూసే సీన్ ని స్పూఫ్ చేసారు.
అయితే దానిపై పలువురు విమర్శలు చేసారు. నంది కొమ్ముల నుంచి అలా హీరోయిన్ ని చూడటం, స్కిట్ వేసి కామెడీ చేయడంతో పలువురు సారీ చెప్పాలని. మా మనోభావాలు దెబ్బ తిన్నాయని గొడవ చేశారు. సుధీర్ ని, రవిని కూడా బెదిరించారు. అప్పుడే రవి చిరంజీవి చేస్తే తప్పు లేదు మేము చేస్తే తప్పా అని ప్రశ్నించాడు.
తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆ ఘటనపై మాట్లాడుతూ ఈ విషయంలో తను, సుధీర్ ఎంత ఇబంది పడ్డారో తెలిపాడు.
యాంకర్ రవి మాట్లాడుతూ.. నేను కావాలని చేయని దానికి సారీ చెప్పను, చెప్పలేదు. కొంతమంది కావాలని వీడు హిందూ మతానికి వ్యతిరేకంగా చేస్తున్నాడు అని గొడవ చేసారు. అలాంటి టైంలో నా నంబర్, సుధీర్ నెంబర్ ఎవరో పేస్ బుక్ లో పెట్టారు. వీరిద్దరూ హిందూ మతాన్ని అవమానించారు అని. మేము స్కిట్ ఇలా హర్ట్ చేద్దామని రాయలేదు. ఉన్నదాన్ని స్పూఫ్ చేసాము. అప్పుడు 20 ఏళ్ళ క్రితం బావగారు బాగున్నారా సినిమాలో చిరంజీవి, రంభ చేసిందే మేము చేసాము. రంభ గారు వచ్చారు కాబట్టి చేసాము. అక్కడ సినిమాలో ఏం చేశారు మేము అదే చేసాము. ఆ సినిమాలో ఉన్నదే పెట్టాము. కొంతమంది కావాలని ఏదో గొడవ చేసారు. మాకు ఫోన్స్ మీద ఫోన్స్. సుధీర్ ఫోన్ చేసి ఇలా అవుతుంది, ఛానల్ పట్టించుకోవట్లేదు అని చెప్పాడు. నేను కూడా ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాను. ఫోన్ ఆన్ చేసాక 1300 మెసేజ్ లు. ఇష్టమొచ్చినట్టు బూతులు తిడుతూ పెట్టారు. ఫోన్స్ ఇంకా వస్తున్నాయి. కొన్నిటికి ఫోన్ లిఫ్ట్ చేసి అది కావాలని చేసింది కాదు అని చెప్తూనే ఉన్నా. ఒకడు నువ్వు హిందువువా అని అడిగితే నేను ఇండియన్ ని అన్నా. వాడు అంటే హిందూ కాదా అని అడిగాడు. ఇండియా అంటే హిందుస్థాన్ కదా అందులోనే ఉంది కదా హిందూ అని అంటే అదంతా రికార్డ్ చేసి వీడు హిందూ కాదంట అని పేల్చాడు అంటూ ఆ ఇష్యూ వల్ల పడ్డ ఇబ్బందిని తెలిపాడు.
Also Read : Sridevi : శ్రీదేవికి ప్రపోజ్ చేయాలనుకున్న రజినీకాంత్.. కమల్ కిఇచ్చి పెళ్లి చేయాలనుకున్న శ్రీదేవి తల్లి..