Sridevi : శ్రీదేవికి ప్రపోజ్ చేయాలనుకున్న రజినీకాంత్.. కమల్ కిఇచ్చి పెళ్లి చేయాలనుకున్న శ్రీదేవి తల్లి..

ఆమె కూడా పలువురితో ప్రేమలో ఉందని వార్తలు వచ్చినా చివరకు బోనీ కపూర్ ని పెళ్లి చేసుకుంది.

Sridevi : శ్రీదేవికి ప్రపోజ్ చేయాలనుకున్న రజినీకాంత్.. కమల్ కిఇచ్చి పెళ్లి చేయాలనుకున్న శ్రీదేవి తల్లి..

Sridevi

Updated On : August 6, 2025 / 6:27 AM IST

Sridevi : అతిలోక సుందరి శ్రీదేవిని అభిమానులతో పాటు చాలా మంది వివిధ రంగాల ప్రముఖులు ఆమెని ఆరాధించేవాళ్ళు. ఆమె కూడా పలువురితో ప్రేమలో ఉందని వార్తలు వచ్చినా చివరకు బోనీ కపూర్ ని పెళ్లి చేసుకుంది. అయితే ఒకానొక సమయంలో శ్రీదేవికి సూపర్ స్టార్ రజినీకాంత్ ప్రపోజ్ చేయాలనుకున్నాడట. మరోవైపు శ్రీదేవి తల్లి ఆమెను కమల్ హాసన్ కి ఇచ్చి పెళ్లి చేయాలనుకుందట.

శ్రీదేవి రజినీకాంత్ తో దాదాపు 10 సినిమాలకు పైగా కలిసి నటించారు. ఆమె కొత్త ఇల్లు కట్టుకున్నప్పుడు స్టార్స్ అందర్నీ గృహ ప్రవేశానికి పిలిచారు. రజినీకాంత్ కూడా ఆ గృహప్రవేశానికి హాజరయ్యారు. తన ప్రేమను చెప్పడానికి అదే మంచి సమయం అని భావించి శ్రీదేవికి అప్పుడు ప్రపోజ్ చేయాలనుకున్నాడట రజినీ. కానీ రజినీ కొత్తింట్లోకి అడుగుపెట్టగానే కరెంట్ పోయిందట. ఇల్లంతా చీకటిగా అయిందట. దీంతో ఇది మంచి శకునం కాదని భావించి శ్రీదేవితో ఏం మాట్లాడకుండానే రజినీ బయటకు వచ్చేశారట. ఆ తర్వాత కూడా రజినీ శ్రీదేవితో కలిసి నటించారు. ఈ విషయాన్ని దర్శకుడు బాలచందర్ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.

Also See : NTR Special Photo Shoot : ఎన్టీఆర్ లేటెస్ట్ ఫొటోలు చూశారా..? స్టైలిష్ లుక్స్ లో..

ఇక మరోవైపు శ్రీదేవి తల్లి ఏమో ఆమెని కమల్ హాసన్ కి ఇచ్చి పెళ్లి చేయాలనుకుంది. కమల్ దగ్గరకు వెళ్లి శ్రీదేవిని పెళ్లి చేసుకోమని కూడా అడిగారట. కానీ కమల్ కి ఇష్టం లేక, శ్రీదేవి ఎప్పుడూ ఆ కోణంలో చూడలేదని ఆ ప్రతిపాదనను తిరస్కరించారు. శ్రీదేవి – కమల్ కూడా అనేక సినిమాల్లో కలిసి నటించారు. అలా ఓ స్టార్ హీరో శ్రీదేవికి ప్రపోజ్ చేయాలనుకున్నారు. మరో స్టార్ హీరోతో పెళ్లి చేయాలనుకున్నారు ఆమెకు. కానీ అవేమి జరగలేదు.