Chandini Chowdary : సినిమాకు ఐదేళ్లు కష్టపడ్డా రావాల్సిన డబ్బులు ఇవ్వలేదు.. చాందిని చౌదరి సంచలన వ్యాఖ్యలు..
హీరోయిన్ చాందిని చౌదరి కూడా అలాంటి ఆరోపణలే చేసింది. (Chandini Chowdary)
Chandini Chowdary
Chandini Chowdary : సినీ పరిశ్రమలో చేసిన వర్క్ కి డబ్బులు ఇవ్వలేదని అప్పుడప్పుడు పల్కువురు నటీనటులు, సాంకేతిక నిపుణులు ఆరోపణలు చేస్తూ ఉంటారు. తాజాగా తెలుగమ్మాయి, హీరోయిన్ చాందిని చౌదరి కూడా అలాంటి ఆరోపణలే చేసింది.
తన ఇన్స్టాగ్రామ్ లో ఆర్టిస్టులకు ఎందుకు డబ్బులు లేట్ గా ఇస్తారు అనే పోస్ట్ ని షేర్ చేసి.. నాకు రెండేళ్లు నుంచి రావాల్సిన డబ్బుల కోసం ఎదురుచూస్తున్నాను. ఆ సినిమాకు ఐదేళ్లపాటు కష్టపడ్డాను. చాలా సమయం వెచ్చించాను. కానీ చివరికి వాళ్ళు నన్ను పట్టించుకోకుండా వదిలేశారు అని పోస్ట్ పెట్టింది.
Also Read : Thagubothu Ramesh : కమెడియన్ తాగుబోతు రమేష్ ఫ్యామిలీని చూశారా..? ఫొటోలు..
దీంతో చాందిని పోస్ట్ వైరల్ గా మారింది. అయితే చాందిని అయిదేళ్ల పాటు ఒకే సినిమాకు వర్క్ చేసింది అంటే అది విశ్వక్ సేన్ గామి సినిమానే. ఆ సినిమా రిలీజ్ అయి కూడా రెండేళ్లు అవుతుంది. చాందిని షేర్ చేసిన పోస్ట్ ప్రకారం రెండేళ్ల నుంచి ఎదురుచూస్తున్నాను, ఐదేళ్లు కష్టపడ్డాను అంటే అది గామి సినిమా అనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు నెటిజన్లు. మరి అది గామి సినిమానేనే లేక వేరేది ఏదైనా ఉందా తనకే తెలియాలి. చాందిని పోస్ట్ పై ఎవరైనా నిర్మాతలు స్పందిస్తారా చూడాలి.

