Chandrababu Oath in Unstoppable in front of Balakrishna Promo goes Viral
Chandrababu – Balakrishna : బాలకృష్ణ హోస్ట్ గా ఆహా ఓటీటీలో అన్‌స్టాపబుల్ సీజన్ 4 అక్టోబర్ 25 నుంచి రానున్న సంగతి తెలిసిందే. మొదటి ఎపిసోడ్ కి ఏపీ సీఎం చంద్రబాబు నాయిడు రానున్నారు. తాజాగా దీనికి సంబంధించిన ప్రోమో రిలీజ్ చేశారు. ఈ ప్రోమోలోనే బోలెడన్ని ఆసక్తికర విషయాలు బాలయ్య, చంద్రబాబు చర్చించుకున్నారు. పాలిటిక్స్, ఫ్యామిలీ, పవన్ కళ్యాణ్ గురించి.. ఇలా అనేక అంశాలు మాట్లాడారు.
అయితే షోలో చంద్రబాబు గురించి బాలయ్య.. దేశ రాజకీయ చరిత్ర ఎరగని విజయాన్ని అందుకున్న చాణుక్యుడు మన ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు మా బావ గారు మీ బాబు గారు నారా చంద్రబాబు నాయుడు గారు అంటూ ఘనంగా స్వాగతం పలికారు. ఆ తర్వాత ఇద్దరూ కలిసి సీనియర్ ఎన్టీఆర్ కు నివాళులు అర్పించారు.
షో మొదలయ్యే ముందు సరదాగా చంద్రబాబుతో అన్‌స్టాపబుల్ పుస్తకంపై ప్రమాణం చేయించారు బాలయ్య. బాలయ్య చెప్తుంది చంద్రబాబు దాన్ని రిపీట్ చేశారు. చంద్రబాబు అనే నేను బాలకృష్ణ మీద ప్రేమతో ఏది అడిగితే దానికి నవ్వుతూ సమాధానం చెప్తాను అని ప్రమాణం చేయించారు. బాలయ్య మీద ఒట్టు అంటూ సరదా చేశారు చంద్రబాబు. ఇక బాలయ్యని ఉద్దేశించి.. మీ చమత్కారం మీది మా సమయస్ఫూర్తి మాది అన్నారు చంద్రబాబు. ప్రస్తుతం ప్రోమో వైరల్ గా మారింది. మీరు కూడా ఈ ప్రోమో చూసేయండి..