Chandrahaas : ఆటిట్యూడ్ స్టార్ చంద్రహాస్ కొత్త సినిమా అనౌన్స్.. పాత ఐదు రూపాయల కాయిన్స్‌ని బ్యాన్ చేస్తే ఏం జరిగింది..

ఆటిట్యూడ్ స్టార్ చంద్రహాస్ తాజాగా తన కొత్త సినిమాని ప్రకటించాడు. (Chandrahaas)

Chandrahaas

Chandrahaas : ఆటిట్యూడ్ స్టార్ చంద్రహాస్ ఇప్పటికే రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. తన పుట్టిన రోజు సందర్భంగా తాజాగా కొత్త సినిమా ప్రకటించారు. శ్రీకాంత్ రాజారత్నం నిర్మాతగా జైరామ్ చిటికెల దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘కాయిన్’. నేడు ఈ సినిమా టైటిల్ ప్రకటిస్తూ ఫస్ట్ పోస్టర్ రిలీజ్ చేస్తూ ప్రెస్ మీట్ నిర్వహించారు.(Chandrahaas)

ఈ ప్రెస్ మీట్ కి గెస్ట్ గా వచ్చిన డైరెక్టర్ సాయి రాజేష్ మాట్లాడుతూ.. ప్రభాకర్ గారితో నాకు చాలా ఏళ్ల అనుబంధం ఉంది. చంద్రహాస్ నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. ఈ కథ చెప్పినప్పుడు కాయిన్ చుట్టూ ఇంత జరిగిందా అని షాక్ అయ్యాను. ట్రైలర్ వచ్చిన తరువాత సినిమాపై అంచనాలు పెరుగుతాయి అని అన్నారు.

Also Read : Sydney Sweeney : బాలీవుడ్ సినిమా కోసం హాలీవుడ్ హీరోయిన్.. వామ్మో ఏకంగా 530 కోట్ల రెమ్యునరేషన్ ఇచ్చి..?

ఆటిట్యూడ్ స్టార్ చంద్రహాస్ మాట్లాడుతూ.. యథార్థ సంఘటనల ఆధారంగా డైరెక్టర్ జైరామ్ ఈ కాయిన్ సినిమాని రాశారు. పాత ఐదు రూపాయల కాయిన్స్‌ని బ్యాన్ చేయడం, ఆ కాయిన్స్ మెల్ట్ చేయడం, వాటి నేపథ్యంలో క్రైమ్ అనే పాయింట్లతో అద్భుతంగా కథ ఉంటుంది. నేను కథ నచ్చితే ఏ జానర్ అన్నది ఆలోచించను. అన్ని రకాల సినిమాలు చేస్తాను. సినిమాల్ని పూర్తిగా నేనే ఓకే చేస్తాను. నాన్న అప్పుడప్పుడు సలహాలు, సూచనలు ఇస్తుంటారు. నన్ను సపోర్ట్ చేసిన వాళ్ల నమ్మకాన్ని నిలబెట్టడానికి, నన్ను ట్రోల్ చేసే వారికి సమాధానం చెప్పేందుకు నేను ఎప్పుడూ కష్ట పడుతూనే ఉంటాను అని అన్నారు.

డైరెక్టర్ జైరామ్ చిటికెల మాట్లాడుతూ.. ఐదు రూపాయల కాయిన్ ఎందుకు బ్యాన్ అయింది అనే నేపథ్యంతో ఈ సినిమా తెరకెక్కిస్తున్నాను. మున్ముందు ఈ సినిమా గురించి మరిన్ని విషయాలు చెబుతాను. నేను చంద్రహాస్ చేసిన ఆర్ఆర్ఆర్ కవర్ సాంగ్‌ని చూశాను. అందులో అతని ఎనర్జీ చూసి ఈ కథను చెప్పాను. ఈ కథను నా కంటే ఎక్కువగా చంద్రహాస్ నమ్మారు అని తెలిపారు.

Also See : Priyanka Chopra : నిక్ జోనస్ బర్త్ డే.. భర్తతో క్యూట్ ఫొటోలు షేర్ చేసిన మహేష్ బాబు హీరోయిన్..