రెబల్ స్టార్ ప్రభాస్ గొప్ప మనసు గురించి క్యారెక్టర్ ఆర్టిస్ట్ హేమ ఇటీవల ఓ ఇంటర్వూలో చెప్పారు..
సినీ హీరోలు చాలా మంది సొసైటీకి తమ వంతు సాయం చేసి తెర వెనుక కూడా హీరోలు అనిపించుకుంటూ ఉంటారు.. కొందరు బయటకి చెప్పుకుంటారు, మరికొందరు చెప్పుకోవడానికి ఇష్ట పడరు.. అలాంటి వారిలో రెబల్ స్టార్ ప్రభాస్ కూడా ఒకరు..
అక్షరాలా కోటి రూపాయలు ఆయన విరాళమిస్తా అన్నారు.. అసలు ఏం జరిగింది అంటే.. క్యారెక్టర్ ఆర్టిస్ట్ హేమ రీసెంట్‌గా ఓ ఇంటర్వూలో ప్రభాస్ మంచి మనసు గురించి చెప్పారు.. ‘ప్రోగ్రామ్‌కి రమ్మని ప్రభాస్‌ని పిలిస్తే ఏమన్నారో తెలుసా’.. ‘ప్రోగ్రామ్ ఎందుకులే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) కి కోటి రూపాయలు డొనేట్ చేస్తాను’ అన్నారు..
Read Also : ‘సంగతమిళన్’ తెలుగులో ‘విజయ్ సేతుపతి’ : చీఫ్ గెస్ట్‌గా చిరంజీవి
‘నాన్నా నువ్వు ఇస్తావ్.. కానీ. నువ్వో ప్రోగ్రామ్ చేస్తే.. నీ కోటితో పాటు ఇంకో రెండు, మూడు కోట్లు వస్తాయ్.. అనగానే.. సరే, మీ ఇష్టం.. మీరు ఎప్పుడు పెట్టుకుంటే అప్పుడు పిలవండి వస్తాను అన్నారు’.. అంటూ హేమ, ప్రభాస్ గొప్ప మనసు గురించి ప్రేక్షకులకు చెప్పారు..