Cheater Trailer
Cheater Trailer release : రేఖ నిరోషా, చంద్రకాంత్ దత్త, నరేందర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం చీటర్(Cheater). బర్ల నారాయణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను యస్ఆర్ఆర్ ప్రొడక్షన్ పతాకం పై పరుపాటి శ్రీనివాసరెడ్డి నిర్మిస్తున్నారు. ఈ సినిమా సెప్టెంబర్ 22న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ప్రమోషనల్ కార్యక్రమాల్లో వేగం పెంచింది. అందులో భాగంగా ఇటీవల చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు.
ఈ సందర్భంగా నిర్మాత శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ సినిమా అద్భుతంగా వచ్చిందన్నారు. దర్శకుడు చాలా కష్టపడి పని చేసినట్లు చెప్పారు. సినిమా తప్పకుండా ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ధీమాను వ్యక్తం చేశారు. ఇప్పటికే ట్రైలర్‌ను 12లక్షల మందికి పైగా వీక్షించినట్లు చెప్పారు. సెప్టెంబర్ 22న ప్రేక్షకుల ముందుకు ఈ సినిమాను తీసుకువస్తున్నట్లు చెప్పారు.
దర్శకుడు నారాయణ మాట్లాడుతూ సస్పెన్స్ థ్రిల్లర్‌గా ఈ సినిమాను తెరకక్కించినట్లు చెప్పారు. ప్రేక్షకులకు నచ్చే అంశాలు ఉన్నట్లు తెలిపారు. సినిమాను థియేటర్లలో చూసి ఆదరించాలని కోరారు.