Chennakesava Reddy Breaks Pokiri Re-Release Record
Chennakesava Reddy: ప్రస్తుతం టాలీవుడ్‌లో హిట్ సినిమాల రీ-రిలీజ్ అనే కొత్త ట్రెండ్ హవా సాగుతోంది. ఇప్పటికే సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టినరోజున పోకిరి సినిమాను భారీ స్థాయిలో రీ-రిలీజ్ చేసి బాక్సాఫీస్ వద్ద అదరహో అనిపించారు. ఇక రీసెంట్‌గా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బర్త్‌డే రోజున కూడా జల్సా, తమ్ముడు వంటి సినిమాలను రీ-రిలీజ్ చేసి అభిమానులు చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. ఇక బాక్సాఫీస్ వద్ద ఈ రెండు సినిమాలు కూడా కళ్లు చెదిరే కలెక్షన్లు రాబట్టి తమ సత్తా చాటాయి.
Balakrishna Chennakesava Reddy: బాక్సాఫీస్ భరతం పట్టేందుకు ‘చెన్నకేశవరెడ్డి’ మళ్లీ వస్తున్నాడు!
కాగా, ఇప్పుడు ఈ రీ-రిలీజ్ జాబితాలో నందమూరి బాలకృష్ణ కూడా జాయిన్ అవుతున్నాడు. బాలయ్య నటించిన ఊరమాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘చెన్నకేశవరెడ్డి’ ఆయన కెరీర్‌లో ఎలాంటి హిట్ మూవీగా నిలిచిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఈ సినిమాను మరోసారి రిలీజ్ చేసేందుకు అభిమానులు రెడీ అవుతున్నారు. ఈ క్రమంలోనే చెన్నకేశవ రెడ్డి సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ శరవేగంగా జరుగుతున్నాయి. ముఖ్యంగా ఓవర్సీస్‌లో బాలయ్యకు ఉన్న క్రేజ్ ఎలాంటిదో మరోసారి ఈ సినిమా టికెట్ల అడ్వాన్స్ బుకింగ్స్ చూస్తే అర్థమవుతుంది. యూఎస్‌లో ఈ సినిమా ప్రీ-బుకింగ్స్‌తోనే ఏకంగా 25 వేల డాలర్లు వసూలు చేసింది.
Chennakesava Reddy : బాలయ్య ఫ్యాన్స్ రచ్చ రంబోలా..
ఇది మహేష్ బాబు ‘పోకిరి’ రికార్డును బ్రేక్ చేసింది. పోకిరి సినిమా రీ-రిలీజ్ టైమ్‌లో 15 వేల డాలర్లు వసూలు చేసింది. కేవలం ప్రీబుకింగ్స్‌తోనే బాలయ్య ఈ రేంజ్ వసూళ్లు రాబట్టడంతో ఈ సినిమా రీ-రిలీజ్ అయ్యే సమయానికి ఇంకా ఎలాంటి వసూళ్లు రాబడుతుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఇక జల్సా సినిమా యూఎస్ బాక్సాఫీస్ దగ్గర 37 వేల డాలర్లు వసూలు చేసింది. మరి జల్సా రికార్డును చెన్నకేశవ రెడ్డి బద్దలుకొడతాడా అని నందమూరి అభిమానులు ఆసక్తిగా చూస్తున్నారు. ఏదేమైనా తన సినిమా రీ-రిలీజ్‌తోనూ బాలయ్యా.. మజాకా అనిపిస్తున్నాడు ఈ నందమూరి హీరో.