Chennakesava Reddy : బాలయ్య ఫ్యాన్స్ రచ్చ రంబోలా..

బాలయ్య నటించిన ‘చెన్నకేశవ రెడ్డి’ సినిమా 19 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఫ్యాన్స్ స్పెషల్ షో వేశారు..

Chennakesava Reddy :  బాలయ్య ఫ్యాన్స్ రచ్చ రంబోలా..

Balayya Fans

Updated On : September 26, 2021 / 7:11 PM IST

Chennakesava Reddy: నటసింహ నందమూరి బాలకృష్ణ అభిమానులు ఏం చేసినా స్పెషలే.2002 సెప్టెంబర్ 25న రిలీజ్ అయిన బాలయ్య మాస్ హిట్ సినిమా ‘చెన్నకేశవ రెడ్డి’ 2021 సెప్టెంబర్ 25 నాటికి 19 సంవత్సరాలు పూర్తి చేసుకుంటుంది. ఈ సందర్భంగా శనివారం (సెప్టెంబర్ 25) హైదరాబాద్, ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లోని దేవి 70 MM థియేటర్లో స్పెషల్ షో ప్లాన్ వేశారు.

Banners

Banners

ప్రింట్‌ని డిజిటల్‌లోకి ఆ తర్వాత క్యూబ్‌లోకి మార్చి అప్పటి సినిమాను క్వాలిటీ ప్రింట్‌తో ప్లే చేశారు. ఇక బాలయ్య ఫ్యాన్స్ అయితే సినిమా రిలీజ్ అవుతుందా అనిపించేలా భారీ ఫ్లెక్సీలతో థియేటర్ అంతా కవర్ చేసేశారు. షో కి ముందు క్రాకర్స్, డప్పులు, డ్యాన్సులు, ‘జై బాలయ్య’ స్లోగన్లతో హంగామా చేశారు.

ఈ షో లో ‘బాలయ్య యువసేన’ టీం హైలెట్‌గా నిలిచారు. ఎప్పటిలానే ‘బాలయ్య యువసేన’ టీ షర్టులు ధరించి ప్రేక్షకుల్లో ప్రత్యేకంగా కనిపించి ఆకట్టుకున్నారు. ‘రాయాల్టీ కా బాప్’ అంటూ బాలయ్ ప్లకార్డులు ప్రదర్శించారు. ‘చెన్నకేశవ రెడ్డి’ జైలు నుంచి వచ్చాక చెల్లెలు ఇంటికెళ్లేటప్పుడు బాలయ్య బొమ్మని కాసేపు ఫ్రీజ్ చేసి రచ్చ చేశారు.

Theatre

 

Theatre

 

బాలయ్య మార్క్ డైలాగ్స్, డ్యాన్సులప్పుడు గోల గోల చేశారు. థియేటర్ ఫుల్ అవడంతో పాటు చాలా మంది నిలబడి సినిమా చూడడం విశేషం. ఈ స్పెషల్ షో సినిమా ఇండస్ట్రీ వర్గాలు, బాలయ్య అభిమానుల్లో చర్చనీయాంశంగా మారింది. తెనాలి, అనంతపూర్ వంటి చోట్ల కూడా ‘చెన్నకేశవ రెడ్డి’ స్పెషల్ షో లు వేశారు.

Theatre

Balayya Fans