Balakrishna Chennakesava Reddy: బాక్సాఫీస్ భరతం పట్టేందుకు ‘చెన్నకేశవరెడ్డి’ మళ్లీ వస్తున్నాడు!

ఇటీవల స్టార్ హీరోల సినిమాలను రి-రిలీజ్ చేస్తూ అభిమానులు చేస్తున్న సందడి అంతా ఇంతా కాదు. సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టినరోజున ‘పోకిరి’, పవన్ కళ్యాణ్ పుట్టినరోజున జల్సా, తమ్ముడు వంటి సినిమాలను స్పెషల్ షోలుగా రీ-రిలీజ్ చేసి అభిమానులు ఏ స్థాయిలో ఎంజాయ్ చేశారో మనం చూశాం. అయితే ఇప్పుడు ఈ రీ-రిలీజ్ జాబితాలోకి నందమూరి బాలకృష్ణ కూడా వచ్చి చేరుతున్నాడు.

Balakrishna Chennakesava Reddy: బాక్సాఫీస్ భరతం పట్టేందుకు ‘చెన్నకేశవరెడ్డి’ మళ్లీ వస్తున్నాడు!

Balakrishna Chennakesava Reddy To Re-Release In Theatres

Balakrishna Chennakesava Reddy: ఇటీవల స్టార్ హీరోల సినిమాలను రి-రిలీజ్ చేస్తూ అభిమానులు చేస్తున్న సందడి అంతా ఇంతా కాదు. సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టినరోజున ‘పోకిరి’, పవన్ కళ్యాణ్ పుట్టినరోజున జల్సా, తమ్ముడు వంటి సినిమాలను స్పెషల్ షోలుగా రీ-రిలీజ్ చేసి అభిమానులు ఏ స్థాయిలో ఎంజాయ్ చేశారో మనం చూశాం. ఇక ఈ రీ-రిలీజ్‌లోనూ ఈ చిత్రాలు భారీ కలెక్షన్స్ రాబట్టడం విశేషం. అయితే ఇప్పుడు ఈ రీ-రిలీజ్ అనే అంశం ట్రెండ్‌గా మారిపోవడంతో, ఇతర హీరోల అభిమానులు కూడా తమ అభిమాన హీరోల బ్లాక్‌బస్టర్ చిత్రాలను రీ-రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నారు.

Chennakesava Reddy : బాలయ్య ఫ్యాన్స్ రచ్చ రంబోలా..

ఈ జాబితాలో ముందుగా వస్తున్నాడు నందమూరి బాలకృష్ణ. బాలయ్య కెరీర్‌లో ఊరమాస్ చిత్రంగా నిలిచిన ‘చెన్నకేశవ రెడ్డి’ అప్పట్లో బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ హిట్ మూవీగా నిలిచింది. ఈ సినిమాను దర్శకుడు వివి.వినాయక్ తెరకెక్కించిన తీరు అద్భుతంగా ఉండటం.. బాలయ్య డ్యుయెల్ రోల్‌లో చేసిన పర్ఫార్మెన్స్‌కు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఇక ఈ సినిమాలో బాలయ్య చెప్పిన డైలాగులకు థియేటర్లలో విజిల్స్ టాప్ లేపాయి. కాగా, ఈ సినిమా రిలీజ్ అయ్యి 20 సంవత్సరాలు పూర్తవుతుండటంతో, ఇప్పుడు ఈ సినిమాను మరోసారి థియేటర్లలో రిలీజ్ చేసేందుకు అభిమాలనులు భారీగా ప్లాన్ చేస్తున్నారు.

Balakrishna: బాలయ్య కోసం మళ్లీ ఆమెనే పట్టుకొస్తున్నారా..?

ముఖ్యంగా ఓవర్సీస్‌లో బాలయ్యకు ఎలాంటి ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. కాగా, చెన్నకేశవ రెడ్డి సినిమాను స్పెషల్ షోల రూపంలో రీరిలీజ్ చేసేందుకు యూఎస్‌లో భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు అక్కడి అభిమానులు. ఇప్పటికే ఈ సినిమాను సెప్టెంబర్ 24, 25 తేదీల్లో అక్కడ స్పెషల్ స్క్రీనింగ్ వేయనున్నట్లు వారు ప్రకటించారు. 30 థియేటర్లు కన్ఫం కూడా అయినట్లు వారు పేర్కొన్నారు. మరిన్ని థియేటర్లు యాడ్ కాబోతున్నాయని.. అలాగే, ఏపీ-తెలంగాణ, చెన్నైల్లోనూ ఈ సినిమాను రీరిలీజ్ చేసేందుకు అభిమానులు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. మరి ‘చెన్నకేశవ రెడ్డి’ చిత్రం రీ-రిలీజ్‌తో బాలయ్య థియేటర్లలో ఎలాంటి రచ్చ చేస్తాడా అనేది చూడాలి.

Image