Adipurush Controversy : ఆదిపురుష్‌లోని డైలాగ్స్‌పై మండిప‌డ్డ ముఖ్య‌మంత్రి.. ప్ర‌జ‌లు కోరితే రాష్ట్రంలో సినిమాని నిషేదిస్తాం

రాముడి గా ప్ర‌భాస్ (Prabhas) న‌టించిన చిత్రం ఆదిపురుష్‌(Adipurush). ఓం రౌత్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ సినిమాలో సీత‌గా కృతి స‌న‌న్((Kriti Sanon), సైఫ్ అలీఖాన్(Saif Alikhan) రావణాసురుడిగా క‌నిపించారు

CM Bhupesh Baghel slams Adipurush

Adipurush : రాముడిగా ప్ర‌భాస్ (Prabhas) న‌టించిన చిత్రం ‘ఆదిపురుష్‌'(Adipurush). ఓం రౌత్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ సినిమాలో సీత‌గా కృతి స‌న‌న్((Kriti Sanon), సైఫ్ అలీఖాన్(Saif Alikhan) రావణాసురుడిగా క‌నిపించారు. ఈ సినిమా శుక్ర‌వారం (జూన్ 16)న ఈ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. భారీ అంచ‌నాల మ‌ధ్య విడుద‌లైన ఈ చిత్రం పై ప్ర‌స్తుతం విమ‌ర్శ‌ల జ‌డివాన కొన‌సాగుతోంది. హిందువుల విశ్వాసాలు, మ‌నోభావాల‌ను దెబ్బ‌తీసేలా ఈ సినిమాను తెర‌కెక్కించారంటూ హిందూసేన జాతీయ అధ్య‌క్షుడు విష్ణు గుప్త ఢిల్లీ హైకోర్టులో పిటిష‌న్‌ను దాఖ‌లు చేసిన సంగ‌తి తెలిసిందే.

చిత్రంలోని కొన్ని డైలాగ్స్ తప్పుగా ఉన్నాయని పలువురు రాజకీయ నాయకులు విమర్శలు చేస్తున్నారు. తాజాగా ఛత్తీస్‌గఢ్‌ సీఎం భూపేష్ బాఘేల్ ఆదిపురుష్‌ సినిమాలోని డైలాగ్స్‌పై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. అవ‌స‌రమైతే సినిమాని రాష్ట్రంలో నిషేదిస్తామ‌న్నారు.  శ‌నివారం రాయ్‌పూర్‌లో జ‌రిగిన విలేక‌రుల స‌మావేశంలో ముఖ్య‌మంత్రి భూపేష్ బాఘేల్ ఆదిపురుష్‌పై తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు.

Sunil Narang : ఓటీటీకి సెన్సార్ ఉండాలి.. హీరోలు దేవుళ్ళు.. పాప్‌కార్న్ రేటు తగ్గించాలి.. సునీల్ నారంగ్ సెన్సేషనల్ కామెంట్స్..

ఈ సినిమాలో రాముడి, హ‌నుమంతుడి ప్రతిష్టను కించ‌ప‌రిచే ప్ర‌య‌త్నం జ‌రిగింద‌ని ఆరోపించారు. ప్ర‌జ‌లు కోరితే కాంగ్రెస్‌ ప్ర‌భుత్వం రాష్ట్రంలో సినిమాని నిషేదించే ఆలోచ‌న చేయ‌వ‌చ్చున‌ని అన్నారు. రాముడు, హనుమంతుడి ముఖం సున్నితంగా ఉంటుంది. మన పూర్వీకులు తీసిన చిత్రాల్లో చూశాం. ఆయన జ్ఞానానికి ప్రతీకగా మనకు తెలుసు. ఇది ప్రాచీన కాలం నుంచి పరిచయమైన విధానం.. ఈ రోజుల్లో హనుమంతుడిని కోపంతో ఉన్న పక్షి రూపంలో చూపించడం చూస్తున్నాం. ఈ తరహా హనుమాన్ జీని మన పూర్వీకులు ఊహించలేదు. నేటి సమాజం కూడా అంగీకరించడం లేదన్నారు.

Adipurush : ఆదిపురుష్ హనుమాన్ డైలాగ్స్ పై వివాదం.. నేనేమి తప్పుగా రాయలేదు అంటూ స్పందించిన రైటర్..

సంబాష‌ణ‌లు అస‌భ్య‌క‌రంగా ఉన్నాయి

ఈ సినిమాలోని డైలాగులు, బాష చాలా అస‌భ్య‌క‌రంగా ఉన్నాయ‌న్నారు. తులసీదాసు రామాయణంలో రాముడిని మర్యాద ‘పురుషోత్తమ రాముడు’ అంటారు. ఆదిపురుష్‌లో హనుమాన్ జీ కోసం రాసిన డైలాగ్ పదాలు తక్కువ స్థాయిలో ఉన్నాయన్నారు. ‘ఆదిపురుష్‌’ సాకుతో శ్రీరాముడు, హనుమంతుల చిత్రాలను వక్రీకరించి అసభ్య పదజాలంతో పాత్రధారుల నోళ్లలో పెట్టించారు. దీని నుండి యువ తరం ఏమి నేర్చుకుంటుంది అని ప్ర‌శ్నించారు. చిన్న చిన్న కార‌ణాల‌కే థియేట‌ర్లు మూసివేసే వాళ్లు, నిప్పు పెట్టేవాళ్లు ఈ సినిమాపై ఎందుకు మౌనంగా ఉన్నార‌న్నారు.

Adipurush : మొదటిరోజు కలెక్షన్స్‌తోనే సంచలనం సృష్టించిన ఆదిపురుష్..

ట్రెండింగ్ వార్తలు