Sunil Narang : ఓటీటీకి సెన్సార్ ఉండాలి.. హీరోలు దేవుళ్ళు.. పాప్‌కార్న్ రేటు తగ్గించాలి.. సునీల్ నారంగ్ సెన్సేషనల్ కామెంట్స్..

ప్రెస్ మీట్ అనంతరం సునీల్ నారంగ్ 10 టీవీతో మాట్లాడుతూ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సునీల్ నారంగ్ మాట్లాడుతూ..

Sunil Narang : ఓటీటీకి సెన్సార్ ఉండాలి.. హీరోలు దేవుళ్ళు.. పాప్‌కార్న్ రేటు తగ్గించాలి.. సునీల్ నారంగ్ సెన్సేషనల్ కామెంట్స్..

Producer Sunil Narang Comments on OTT Multiplex and Popcorn rate

Updated On : June 17, 2023 / 7:23 PM IST

Sunil Narang :  తాజాగా నేడు తెలంగాణ స్టేట్ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఇటీవల జరిగిన ఎన్నికలలో గెలుపొందిన వారికి అభినందనలు తెలుపుతూ ఈ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సారి అధ్యక్షుడిగా ప్రముఖ నిర్మాత సునీల్ నారంగ్ ని ఎన్నుకున్నారు. ఈ ప్రెస్ మీట్ కు పలువురు సినీ నిర్మాతలు, ప్రముఖులు హాజరయ్యారు. ప్రెస్ మీట్ లో సినీ పరిశ్రమ సమస్యలపై కూడా మాట్లాడారు.

Tollywood : త్వరలో సీఎం కేసీఆర్‌తో తెలుగు సినీపరిశ్రమ సమావేశం.. తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ కామెంట్స్..

ప్రెస్ మీట్ అనంతరం సునీల్ నారంగ్ 10 టీవీతో మాట్లాడుతూ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సునీల్ నారంగ్ మాట్లాడుతూ.. ఓటీటీకి సెన్సార్ కచ్చితంగా ఉండాలి. అలాగే ఓటీటీకి సినిమాలు త్వరగా ఇవ్వకూడదు. టికెట్స్ రేట్స్ ప్రతి సినిమాకు పెంచకూడదు. వీటిపై మరోసారి అందరితో మాట్లాడతాము. అలాగే శాటిలైట్ చార్జీలు కూడా తగ్గించాలి. ముఖ్యంగా మల్టీప్లెక్స్ లలో పాప్‌కార్న్ రేట్స్ తగ్గించాలి, త్వరలో దీనిపై మల్టీప్లెక్స్ అధినేతలతో పిలిచి మాట్లాడతాం. హీరోలు దేవుళ్ళు. వాళ్ళకి డిమాండ్ ఉంటే ఎక్కువ రెమ్యూనషన్ ఇస్తాము. వాళ్ళని చూసే థియేటర్స్ కి వస్తారు అని అన్నారు. అలాగే ఆయన నిర్మాతగా త్వరలో చేయబోయే సినిమాల గురించి మాట్లాడారు. ఏషియన్ సినిమాస్ తో మరిన్ని మల్టీప్లెక్స్ లు రానున్నట్టు తెలిపారు.