Chikiri song from Peddi movie releasing soon
Peddi: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ పెద్ది. ఉప్పెన లాంటి బ్లాక్ బస్టర్ తరువాత దర్శకుడు(Peddi) బుచ్చిబాబు సనా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. విలేజ్ బ్యాక్డ్రాప్ లో స్పోర్ట్స్ డ్రామా కాన్సెప్ట్ తో ఈ సినిమా తెరకెక్కనుంది. పాన్ ఇండియా లెవల్లో భారీగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా.. కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ కీ రోల్ లో కనిపిస్తున్నాడు. దీంతో, పెద్ది సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. మెగా ఫ్యాన్స్ కూడా ఈ సినిమాపై చాలా ఆశలే పట్టుకున్నారు. గేమ్ ఛేంజర్ లాంటో ప్లాప్ తరువాత వస్తున్న ఈ సినిమా భారీ విజయం సాధించాలని కోరుకుంటున్నారు.
Sneha Reddy: అల్లు అర్జున్ భార్య స్నేహ రెడ్డి ఫోటోలు.. ఎంత క్యూట్ గా ఉందో చూశారా..
అయితే, పెద్ది సినిమా నుంచి ఫస్ట్ సాంగ్ విడుదల చేయడానికి సిద్ధం అయ్యారు మేకర్స్. ఇప్పటికే ఈ సాంగ్ గురించి దర్శకుడు బుచ్చిబాబు హింట్ ఇచ్చేశారు. లవ్ సాంగ్ గా రానున్న ఈ పాట త్వరలో విడుదల కానున్నట్టు తెలుస్తోంది. అదే “చికిరి” పాట. ఈ పాటను బాలీవుడ్ స్టార్ సింగర్ మోహిత్ చౌహన్ పడుతున్నాడు. ఏఆర్ రెహమాన్ సంగీతంలో వస్తున్న ఈ పాట ఆడియన్స్ మనసులను దోచుకోవడం ఖాయం అని పెద్ది టీం చెప్తున్నారు. ఇక గతంలో కూడా ఏఆర్ రెహమాన్- సింగర్ మోహిత్ చౌహన్ కాంబోలో చాలా హిట్ సాంగ్స్ వచ్చాయి. వాటి రేంజ్ లోనే ఈ సాంగ్ కూడా ఉంటుందని వార్తలు వినిపిస్తున్నాయి.
త్వరలో హైదరాబాద్ లో జరుగనున్న ఏఆర్ రహమాన్ మ్యూజికల్ కాన్సర్ట్ లో ఈ పాట విడుదల కానుంది. త్వరలోనే దీనిపై మేకర్స్ అధికారిక ప్రకటన రానుంది. ఇక పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కుతున్న పెద్ది సినిమా 2026 మర్చి 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఓపక్క షూటింగ్, మరోపక్క పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఒకే సమయంలో జరుగుతున్నాయి. కాబట్టి, రిలీజ్ విషయంలో ఎలాంటి మార్పులు ఉండవని, అనుకున్న టైం కి పెద్ది సినిమా విడుదల అవుతుందని, బ్లాక్ బస్టర్ సాదిస్తుందని మేకర్స్ ధీమాగా ఉన్నారు.