Child Artist Aanand Vardhan Turned as Hero shared memories with Megastar Chiranjevei
Aanand Vardhan : ఒకప్పటి చైల్డ్ ఆర్టిస్టులు చాలా మంది ఇప్పుడు హీరోలుగా, హీరోయిన్స్ గా వస్తున్న సంగతి తెలిసిందే. ఆ కోవలోకే మరో చైల్డ్ ఆర్టిస్ట్ వచ్చాడు. ఎన్నో సినిమాలతో మనల్ని మెప్పించిన ఒకప్పటి చైల్డ్ ఆర్టిస్ట్ ఇటీవల హీరోగా నిదిరించు జహాపన అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా పలు ఇంటర్వ్యూలో ఇవ్వగా చైల్డ్ ఆర్టిస్ట్ గా ఉన్నప్పుడు అప్పటి నటీనటులతో తనకున్న అనుబంధాన్ని పంచుకున్నాడు.
Also Read : Harish Shankar : ఫుల్ టైం నటుడిగా మారుతున్న డైరెక్టర్ హరీష్ శంకర్..? ఆ హీరో సినిమాలో కీలక పాత్రలో..
ఈ క్రమంలో చిరంజీవితో జరిగిన ఓ సంఘటన పంచుకున్నాడు. ఆనంద్ వర్ధన్ మాట్లాడుతూ.. వంశీ బర్కీలీ అనే అవార్డ్స్ సమయంలో నాకు మనసంతా నువ్వే సినిమాకు అవార్డు వచ్చింది. ఆ అవార్డు చూడటానికి ఆస్కార్ అవార్డులా ఉంటుంది. ఆ అవార్డు ఇచ్చాక మాట్లాడమంటే నేను.. ఈ అవార్డు చిరంజీవి గారి చేతుల మీదుగా తీసుకోవడం నాకు ఆస్కార్ అవార్డులా ఉంది అని అనడంతో నా మాటలకు చిరంజీవి గారు మాట్లాడుతూ ఏడ్చేశారు. ఆ రోజు నా మాటలకు చిరంజీవి గారు ఎమోషనల్ అయి మాట్లాడుతూ ఏడ్చేశారు అని తెలిపాడు.
ఆనంద్ వర్ధన్ చిరంజీవితో ఇంద్ర, శ్రీ మంజునాథ సినిమాలో నటించాడు. ఆనంద్ ప్రియరాగాలు, ప్రేమించుకుందాం రా, పెళ్లి పందిరి, సూర్యవంశం, మనసంతా నువ్వే, శ్రీ మంజునాథ, మావిడాకులు, ఇంద్ర.. ఇలా పలు తెలుగు సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించాడు. ఇటీవలే నిదిరించు జహాపన సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. మరి భవిష్యత్తులో కూడా హీరోగా మరిన్ని సినిమాలతో వస్తాడేమో చూడాలి.