Vishwak Sen Laila Sequel : ‘లైలా’ సీక్వెల్ లేనట్టేగా..? మరి సీక్వెల్ కోసం చేసిన షూటింగ్, ఆ సీన్స్ సంగతి ఏంటి?
ఇటీవల వాలెంటైన్స్ డేకి విశ్వక్ సేన్ లైలా సినిమాతో రాగా ఆ సినిమా డిజాస్టర్ అయింది.

Vishwak Sen Laila Movie Sequel Lead Scenes wil come out
Vishwak Sen Laila Sequel : యువ హీరో విశ్వక్ సేన్ వరుస విజయాలతో ప్రేక్షకులను మెప్పించాడు. కానీ గత రెండు సినిమాలతో నిరాశ పరిచాడు. విశ్వక్ గత సినిమా మెకానిక్ రాకీ యావరేజ్ అనిపించుకున్నా కమర్షియల్ గా ఫ్లాప్ అయింది. ఈ సినిమాకు డబ్బులు రాలేదని విశ్వక్ స్వయంగా చెప్పాడు. ఇటీవల వాలెంటైన్స్ డేకి విశ్వక్ సేన్ లైలా సినిమాతో రాగా ఆ సినిమా డిజాస్టర్ అయింది.
విశ్వక్ లేడీ గెటప్ వేయడం, ఓల్డ్ సిటీ బ్యాక్ డ్రాప్ లో రావడంతో సినిమాపై అంచనాలు ఉన్నా రిలీజయ్యాక చూస్తే అవుట్ డేటెడ్ కామెడీ, అడల్ట్ సీన్స్, డైలాగ్స్ తో ఉండటంతో ఫ్యాన్స్ కి కూడా ఈ సినిమా నచ్చలేదు. దీంతో లైలా ఘోర పరాభవం చూసింది. విశ్వక్ కూడా లైలా ఫ్లాప్ ని ఒప్పుకొని, తన తర్వాత సినిమాల్లో అసభ్యత ఉండదని చెప్తూ ఓ లెటర్ కూడా పోస్ట్ చేసాడు.
అయితే విశ్వక్ ఫ్యాన్స్ కి, సినిమా లవర్స్ కి ఇప్పుడు ఓ కొత్త సందేహం వచ్చింది. లైలా ప్రమోషన్స్ లో ఈ సినిమాకు సీక్వెల్ ఉంటుందని, దానికి సంబంధించి కాస్త షూట్ చేసాం అని, లైలా రిలీజయ్యాక వచ్చిన రెస్పాన్స్ బట్టి వారం రోజుల తర్వాత పార్ట్ 2 కి లీడ్ ఇచ్చేలా ఉండే సీన్స్ ని థియేటర్స్ లో జత చేస్తామని చెప్పాడు విశ్వక్. లైలా రిలీజయి వారం అయింది, ఫ్లాప్ కూడా అయింది. దీంతో పార్ట్ 2 అయితే ఉండదని క్లారిటీ వచ్చేసింది..
మరి పార్ట్ 2 సీక్వెల్ కోసం తీసిన సీన్స్ ని ఏం చేస్తారు? ఓటీటీలో లైలా రిలీజ్ కి ఆ సీన్స్ జత చేసి రిలీజ్ చేస్తారా? లేక డిలీటెడ్ సీన్స్ అని యూట్యూబ్ లో అయినా పెడతారా? అలంటి సినిమాకి కనీసం సీక్వెల్ కి ఏం అనుకున్నారో తెలియాలి కదా అని ఫ్యాన్స్, సినిమా లవర్స్ అడుగుతున్నారు. మరి లైలా సినిమా సీక్వెల్ అనౌన్స్ కోసం తీసిన సీన్స్ ఎప్పుడు బయటకు వస్తాయో చూడాలి.