Trivikram Son : విజయ్ దేవరకొండ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్ గా త్రివిక్రమ్ తనయుడు.. నెక్స్ట్ ఆ హీరో సినిమాకు.. కొడుకుని లైన్లో పెడుతున్న త్రివిక్రమ్..?
విక్రమ్ కు ఇద్దరు కొడుకులు.. రిషి, నీరజ్. వీరిలో పెద్దవాడు రిషి త్వరలో డైరెక్టర్ అవ్వనున్నాడని సమాచారం.

Trivikram Son Working as Assistant Director for Star Hero Movies
Trivikram Son : మాటల మాంత్రికుడు, దర్శకుడి త్రివిక్రమ్ శ్రీనివాస్ తన మాటలతోనే ప్రేక్షకులను కట్టిపడేసేలా మంచి సినిమాలు ఇచ్చారు. గత సంక్రాంతికి త్రివిక్రమ్ మహేష్ బాబుతో గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు. ప్రస్తుతం అల్లు అర్జున్ సినిమాపై వర్క్ చేస్తున్నారు.
అల్లు అర్జున్ తో భారీ బడ్జెట్ లో పాన్ ఇండియా సినిమాగా మైథాలజీ టచ్ ఉన్న కథతో త్రివిక్రమ్ సినిమా ప్లాన్ చేస్తున్నాడు. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ పూర్తయింది. సమ్మర్ లో షూటింగ్ మొదలుపెడతారని సమాచారం. త్రివిక్రమ్ భార్య సాయి సౌజన్య ఇప్పటికే ఫార్ట్యూన్ ఫోర్ నిర్మాణ సంస్థతో నిర్మాతగా సినిమాలు చేస్తుంది. త్రివిక్రమ్ కు ఇద్దరు కొడుకులు.. రిషి, నీరజ్. వీరిలో పెద్దవాడు రిషి త్వరలో డైరెక్టర్ అవ్వనున్నాడని సమాచారం.
Also Read : Sourav Ganguly : ‘గంగూలీ’ బయోపిక్ వచ్చేస్తుంది.. గంగూలీ పాత్రలో నటించే స్టార్ హీరో ఎవరో తెలుసా?
ఇప్పటికే త్రివిక్రమ్ తనయుడు రిషి విజయ్ దేవరకొండ – గౌతమ్ తిన్ననూరి కింగ్ డమ్ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నాడని సినీ పరిశ్రమ సమాచారం. సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు త్రివిక్రమ్ భార్య కూడా నిర్మాత. ఈ సినిమా షూటింగ్ ఫైనల్ స్టేజి లో ఉంది. ఈ సినిమా మేలో రిలీజ్ కానుంది. ఈ సినిమా తర్వాత రిషి ప్రభాస్ సినిమాకు కూడా అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేయనున్నాడు అని సమాచారం.
సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా స్పిరిట్ సినిమా ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ స్టేజిలో ఉంది. ఈ సంవత్సరం చివర్లో షూటింగ్ మొదలు కానుంది. ఈ సినిమాకు కూడా త్రివిక్రమ్ తనయుడు రిషి అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేయనున్నాడు. ఇంకాస్త అనుభవం వచ్చాక రిషి దర్శకుడిగా మారనున్నాడు అని తెలుస్తుంది. దీంతో త్రివిక్రమ్ తన కొడుకుని ఇండస్ట్రీలో డైరెక్టర్స్ దగ్గరికి పంపించి బాగానే ట్రైన్ చేస్తున్నాడని తెలుస్తుంది.
ఇటీవల పవన్ కళ్యాణ్ తనయుడు అకిరా నందన్ హీరోగా డెబ్యూ సినిమా త్రివిక్రమ్ తనయుడు రిషి దర్శకత్వంలోనే ఉంటుందని వార్తలు కూడా వస్తున్నాయి. ఇప్పటివరకు రిషి అధికారికంగా ఎక్కడా బయట కనపడలేదు. మరి త్వరలోనే మీడియా ముందుకు వస్తాడా, డైరెక్టర్ గా ఎంట్రీ ఇవ్వబోతున్నాడా చూడాలి.