Chef Mantra Project K : ‘ఆహా’లో సుమ కుకింగ్ షో.. ఇక్కడ కుకింగ్, కామెడీ, ట్విస్ట్స్ అన్ని మసాలాలు ఉంటాయ్..
చెఫ్ మంత్ర ప్రాజెక్ట్ K అనే షోతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది ఆహా.

Chef Mantra Project K coming soon on aha OTT
తెలుగు ప్రేక్షకులకు యాంకర్ సుమ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈవెంట్లకు హోస్ట్‌గా, నిర్మాతగా, నటిగా టెలివిజన్ రంగంలో విభిన్న రకాల పాత్రలతో రెండు దశాబ్దకాలనికి పైగా రాణిస్తున్నారు. ఇక ఇప్పుడు ఓటీటీలోకి ఓ షోతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఓటీటీలో వంటల కార్యక్రమానికి హోస్ట్‌గా వ్యవహరించనుంది.
తెలుగువారికి ప్రముఖ ఓటీటీ ఆహా ఎంతో చేరువైంది. వైవిధ్యమైన, కుటుంబం అంతా కలిసి చూసేలా మంచి కంటెంట్ ఉన్న సినిమాలు, వెబ్ సిరీస్‌లు, టాక్ షోలతో ప్రేక్షకులను అలరిస్తోంది. తాజాగా చెఫ్ మంత్ర ప్రాజెక్ట్ K అనే షోతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది.
Return of the Dragon : ‘రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్’ మూవీ రివ్యూ.. లవ్ టుడే హీరో ఇంకో హిట్ కొట్టాడా?
‘ఇది జస్ట్ కుకింగ్ షో మాత్రమే కాదు. కుకింగ్, కామెడీ, ట్విస్టులు ఇలా అన్నీ మసాలాలు ఉన్న అల్టిమేట్ కుకింగ్ ఎంటర్‌టైన్‌మెంట్. ఆహ్లాదకరమైన వంటల ప్రయాణం కోసం సిద్ధంగా ఉండండి.’ అంటూ ఆహా తెలిపింది.
ఈ షోకు యాంకర్ గా సుమ వ్యవహరించనుంది. ఈ ప్రోగ్రామ్‌లో రుచికరమైన వంటలను పరిచయం చేయబోతున్నారు. 5 జోడీలు పాల్గొననున్నట్లుగా తెలిపింది. అతి త్వరలోనే చెఫ్ మంత్ర ప్రాజెక్ట్ K స్ట్రీమింగ్‌కు తీసుకురానున్నట్లు ఆహా వెల్లడించింది. దీంతో ఈ షో ఎప్పుడెప్పుడు స్ట్రీమింగ్ అవుతుందా అని చాలా మంది ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Idi just a cooking show kadhu! 🍳🔥
Cooking, comedy, twists anni masala lu unna ultimate cooking entertainment! 🍲Get ready for a delightful ride, coming soon on Aha! 🚀✨#CMPKonAha #aha #Sumakanakala pic.twitter.com/mFeisoHtMb
— ahavideoin (@ahavideoIN) February 18, 2025