Sourav Ganguly : ‘గంగూలీ’ బయోపిక్ వచ్చేస్తుంది.. గంగూలీ పాత్రలో నటించే స్టార్ హీరో ఎవరో తెలుసా?

గత కొన్ని రోజులుగా గంగూలీ బయోపిక్ పై వార్తలు వస్తున్నాయి. తాజాగా గంగూలీ తన బయోపిక్ గురించి మీడియాతో మాట్లాడాడు.

Sourav Ganguly : ‘గంగూలీ’ బయోపిక్ వచ్చేస్తుంది.. గంగూలీ పాత్రలో నటించే స్టార్ హీరో ఎవరో తెలుసా?

Sourav Ganguly Spoke up about his Biopic Bollywood Star Hero Playing His Role

Updated On : February 21, 2025 / 4:43 PM IST

Sourav Ganguly : సినీ, రాజకీయ, క్రీడా.. వివిధ రంగాల్లో విజయం సాధించిన స్టార్స్ బయోపిక్స్ ని ఇటీవల తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే క్రికెట్ నుంచి ధోని బయోపిక్ వచ్చి భారీ విజయం సాధించింది. క్రికెట్ చరిత్రలోని పలు ఘట్టాలతో కూడా సినిమాలు వచ్చాయి. ఇప్పుడు ఒకప్పటి స్టార్ క్రికెటర్, మాజీ టీమిండియా కెప్టెన్ గంగూలీ బయోపిక్ రానుంది.

Also Read : Chef Mantra Project K : ‘ఆహా’లో సుమ కుకింగ్ షో.. ఇక్క‌డ‌ కుకింగ్, కామెడీ, ట్విస్ట్స్ అన్ని మ‌సాలాలు ఉంటాయ్‌..

గత కొన్ని రోజులుగా గంగూలీ బయోపిక్ పై వార్తలు వస్తున్నాయి. తాజాగా గంగూలీ తన బయోపిక్ గురించి మీడియాతో మాట్లాడాడు. గంగూలీ కలకత్తాలో మీడియాతో మాట్లాడుతూ.. నేను విన్న దాని ప్రకారం రాజ్ కుమార్ రావు నా పాత్రని పోషించబోతున్నాడు. కానీ అతను బిజీగా ఉండి డేట్స్ ఇష్యూ వచ్చింది. దీంతో బయోపిక్ రావడానికి సంవత్సరం లేదా అంతకన్నా ఎక్కువే సమయం పట్టొచ్చు అని తెలిపాడు.

Sourav Ganguly Spoke up about his Biopic Bollywood Star Hero Playing His Role

దీంతో గంగూలీ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. బాలీవుడ్ స్టార్ హీరో రాజ్ కుమార్ రావు ఇప్పటికే ఓ సినిమాలో క్రికెటర్ పాత్ర పోషించాడు. దీంతో గంగూలీ పాత్ర అతనికి ఈజీ అవ్వొచ్చు. మరి ఈ సినిమాని ఎవరు డైరెక్ట్ చేస్తున్నారు, నిర్మిస్తున్నారు మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. గంగూలీ బయోపిక్ అంటే జీవితం మొత్తం చూపిస్తారా, కేవలం క్రికెట్ వరకే చూపిస్తారా, ఏమేం అంశాలు సినిమాలో ఉంటాయి అని ఆసక్తి నెలకొంది.

Also Read : Return of the Dragon : ‘రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్’ మూవీ రివ్యూ.. లవ్ టుడే హీరో ఇంకో హిట్ కొట్టాడా?

గంగూలీ టీమిండియా తరపున 113 టెస్ట్ లు, 311 వన్డేలు ఆడాడు. అన్ని ఫార్మెట్స్ లో కలిపి 18,575 రన్స్ సాధించాడు.