Abhinav Manikanta
Abhinav Manikanta : అనేకమంది చైల్డ్ ఆర్టిస్టులు హీరో, హీరోయిన్స్ గా ఎంట్రీ ఇస్తున్నారు. ఈ క్రమంలోనే టాలీవుడ్ లో అనేక సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన అభినవ్ మణికంఠ ఇప్పుడు హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. అంజనీపుత్ర ఫిలింస్ బ్యానర్ లో గుర్రాల సంధ్యారాణి నిర్మాణంలో రాజేష్ గడ్డం దర్శకత్వంలో అభినవ్ మణికంఠ, పూజా యడం జంటగా బొమ్మ హిట్ అనే సినిమా తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఈ సినిమా పూజా కార్యక్రమాలతో మొదలైంది.(Abhinav Manikanta)
పూజా కార్యక్రమం అనంతరం హీరో అభినవ్ మణికంఠ మాట్లాడుతూ.. హీరోగా ఇది నాకు రెండో సినిమా. మొదటి సినిమా వర్క్స్ కూడా జరుగుతున్నాయి. ఇటీవలే నేను నటించిన ర్యాంబో ఇన్ లవ్ వెబ్ సిరీస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది. బొమ్మ హిట్ సినిమా ఫుల్ ఎంటర్టైన్మెంట్ తో ఉంటుంది అని అన్నారు.
డైరెక్టర్ రాజేష్ గడ్డం మాట్లాడుతూ.. ఈ సినిమాతో దర్శకుడిగా ఎంట్రీ ఇవ్వడం సంతోషంగా ఉంది. మా నిర్మాత సంధ్యరాణి గారు ఎంతో సపోర్ట్ చేస్తున్నారు. బొమ్మ హిట్ సినిమాలో ఎంటర్టైన్మెంట్ తో పాటు మెసేజ్ తో ఉంటుంది. త్వరగా షూటింగ్ పూర్తి చేసి 2026 సమ్మర్లో ఈ సినిమాని రిలీజ్ చేస్తాం అని తెలిపారు. నిర్మాత గుర్రాల సంధ్యారాణి మాట్లాడుతూ.. మా అంజనీపుత్ర ఫిలింస్ బ్యానర్ పై మొదటి సినిమాగా బొమ్మహిట్ నిర్మిస్తున్నాం. డైరెక్టర్ మంచి కథ చెప్పాడు. బలమైన కథను బాగా తెరకెక్కిస్తే సినిమా హిట్ అవుతుంది. ఈ సినిమాలో దులో హీరో హీరోయిన్స్ ప్రేమ కథతో పాటు తల్లిదండ్రులు, కొడుకు మధ్య ఉండే అనుబంధం కూడా ఉంటుంది అని అన్నారు.
హైపర్ ఆది మాట్లాడుతూ.. అభినవ్ చైల్డ్ ఆర్టిస్టుగా చాలా సినిమాలు చేసి ఇప్పుడు హీరోగా మన ముందుకు వస్తున్నాడు. మా నిర్మాతలు తెలివిగా బొమ్మ హిట్ అని టైటిల్ పెట్టారు. ఇక ఖచ్చితంగా సినిమా హిట్ చేయాల్సిందే అని అన్నారు.
Also Read : Roshan : తండ్రి కోరిక తీర్చని రోషన్.. శ్రీకాంత్ కోరిక ఏంటో తెలుసా?