China piece : పేరు మార్చుకున్న మరో తెలుగు సినిమా.. చైనా పీస్ కాదు ఇకపై సీక్రెట్ సోల్జర్
నిహాల్ కోదాటి, సూర్య శ్రీనివాస్ హీరోలుగా నటిస్తున్న చిత్రం యూనిక్ స్పై డ్రామా ‘చైనా పీస్’ (China piece).
China piece is now officially titled as secret soldier
China piece : నిహాల్ కోదాటి, సూర్య శ్రీనివాస్ హీరోలుగా నటిస్తున్న చిత్రం యూనిక్ స్పై డ్రామా ‘చైనా పీస్’. అక్కి విశ్వనాధ రెడ్డి దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. కమల్ కామరాజు, రఘు బాబు, రంగస్థలం మహేష్, శ్రీనివాస్ వడ్లమాని, శ్రీకాంత్ అయ్యంగార్ కీలక పాత్రలను పోషిస్తున్నారు. మూన్ లైట్ డ్రీమ్స్ బ్యానర్‌పై ఈ చిత్రం నిర్మితమవుతోంది.
ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ మంచి బజ్‌ను క్రియేట్ చేయగా.. యూనిక్ కాన్సెప్ట్, ఆకట్టుకునే ప్రెజెంటేషన్, యాక్షన్, థ్రిల్, హ్యుమర్ ఎలిమెంట్స్‌తో విడుదలైన టీజర్ సినిమాపై అంచనాలను మరింత పెంచింది. కాగా.. తాజాగా ఈ చిత్రం పేరు మారింది. ‘సీక్రెట్ సోల్జర్’ పేరుతో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
Pooja Hegde : పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన బుట్టబొమ్మ? వైరల్ వార్తల్లో నిజమెంత?

ఈ చిత్ర సెన్సార్ పూరైంది. ఈ చిత్రానికి సెన్సార్ బృందం యూ/ఏ సర్టిఫికెట్‌ను ఇచ్చింది. ఇక ఈ చిత్రాన్ని సెప్టెంబర్‌లో రిలీజ్ చేసేందుకు నిర్మాతలు సన్నాహకాలు చేస్తున్నారు.
