చిరు అభిమానులకి గుడ్ న్యూస్. చిరు152వ సినిమా షూటింగ్ ఈ రోజు (జనవరి 2, 2020) నుంచి కోకాపేటలో వేసిన ప్రత్యేక సెట్ లో ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఆగస్ట్ 14న సినిమాని రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు మూవీ యూనిట్. ఈ సినిమాకి కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు.
ఇక తొలి షెడ్యూల్ లో మాస్ సాంగ్ తెరకెక్కించనున్నట్టు తెలుస్తుంది. ఈ సినిమాని రామ్‌చరణ్, నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్నారు. చిత్రంలో త్రిష కథానాయికగా నటించనున్నట్టు తెలుస్తుంది. ఇక చిరు పాత్ర దేవాదయ, ధర్మా దయ శాఖలో పనిచేసే ఉద్యోగి అని టాక్ వినిపిస్తోంది.
సినిమాలో చిరు ఆలయ భూములను ఆక్రమించటానికి ప్రయత్నించే వారిపై ఎలా చర్యలు తీసుకుంటాడు అనేది ఈ చిత్రానికి మెయిన్ స్టోరీగా తెలుస్తుంది. మణి శర్మ సంగీతం అందిస్తున్నారు. చిరుతో పాటుగా రామ్ చరణ్ కూడా ఈ సినిమాలో కీలక పాత్రలో నటించనున్నారు.