Chiranjeevi about ayodhya ram mandir invitation and Hanuman movie donation
Chiranjeevi : అయోధ రామమందిరం ఓపెనింగ్ కార్యక్రమానికి.. చిరంజీవికి ఆహ్వానం వచ్చిందని ఇటీవల వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే. తాజాగా ఆ వార్తలను నిజం చేస్తూ చిరు అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. చిరంజీవి రీసెంట్ గా ‘హనుమాన్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ముఖ్య అతిథిగా వచ్చారు. తేజ సజ్జ హీరోగా తెరకెక్కిన ఈ చిత్రం హనుమంతుడి నేపథ్యంతో ఓ సూపర్ హీరో కాన్సెప్ట్ తో ఆడియన్స్ ముందుకు రాబోతుంది.
ఈ హనుమాన్ ప్రీ రిలీజ్ ఈవెంట్ వేదిక పై చిరంజీవి మాట్లాడుతూ.. “చరిత్రలో నిలిచిపోయే ఘట్టం అయోధ్య రామ మందిర నిర్మాణం. ఆ ప్రారంభోత్సవానికి నాకు ఆహ్వానం అందింది. ఈ నెల 22న జరగబోయే రామ మందిర ప్రారంభోత్సవానికి మా కుటుంబంతో వెళ్తున్నాను” అంటూ ఆడియన్స్ కి తెలియజేశారు. అలాగే రామ మందిరం కోసం హనుమాన్ మూవీ టీం ఇచ్చే విరాళం గురించి కూడా చిరు తెలియజేశారు.
Also read : Chiranjeevi : సంక్రాంతి సినిమాల విడుదలపై మెగాస్టార్ కామెంట్స్.. దిల్ రాజుని నేను ప్రశ్నించా..
హనుమాన్ సినిమాకు వచ్చే వసూళ్లలో ప్రతి టికెట్ పై రూ.5ను రామ మందిర నిర్మాణానికి విరాళంగా ఇవ్వాలని చిత్ర యూనిట్ నిర్ణయం తీసుకున్నట్లు చిరు తెలియజేశారు. ఆ స్వామి కార్యం కోసం మంచి నిర్ణయాన్ని తీసుకున్న చిత్ర బృందాన్ని చిరు అభినందించారు. కాగా హనుమాన్ మూవీ ఈ నెల 12న సంక్రాంతి కానుకగా రిలీజ్ కాబోతుంది. తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, మలయాళ, హిందీ భాషలతో పాటు ప్రపంచవ్యాప్తంగా మొత్తం 11 భాషల్లో రిలీజ్ కాబోతుంది.