Pawan
Chiranjeevi : చిరంజీవి, చరణ్ కలిసి నటించిన ఆచార్య సినిమా ఏప్రిల్ 29న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఇటీవలే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. సినిమా రిలీజ్ కి మూడు రోజులే ఉండటంతో చిత్ర యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. ఆచార్య సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆచార్య టీం మూవీ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు. ఈ ప్రమోషన్స్ లో భాగంగా ఇవాళ హైదరాబాద్ లోని పార్క్ హయత్ హోటల్ లో ఆచార్య టీం ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ ప్రెస్ మీట్ లో విలేఖరులు అడిగిన పలు ప్రశ్నలకి చిరంజీవి, ఆచార్య టీం సమాధానాలు ఇచ్చారు. ఇందులో భాగంగా ఓ విలేఖరి సిద్ధా క్యారెక్టర్ చరణ్ కాకపోతే పవన్ చేస్తారా అని అడిగారు.
Chiranjeevi : టికెట్ రేట్లు పెంచమని ప్రభుత్వాలని అడిగితే తప్పులేదు
చిరంజీవి దీనికి సమాధానమిస్తూ.. ”దీని గురించి ఆల్రెడీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మాట్లాడాను. ఈ క్యారెక్టర్ కి ఆచార్యకి ఒక మంచి అనుబంధం ఉంటుంది. అది రియల్ తండ్రి కొడుకులు అయిన మేము చేస్తే ఆ ఫీల్ వేరే ఉంటుంది. డైరెక్టర్ కూడా అదే నమ్మారు. ఈ క్యారెక్టర్ చరణ్ కాకుండా ఇంకెవరు చేసినా బాగానే చేస్తారు. కాకపోతే మా ఇద్దరి మధ్య ఉన్న తండ్రి కొడుకుల బంధం ఆ క్యారెక్టర్స్ ని మరింత దగ్గరికి చేస్తుంది. చరణ్ కి ఒకవేళ కుదరకపోతే కచ్చితంగా పవన్ ఈ క్యారెక్టర్ చేసేవాడు. పవన్ కూడా సిద్దా క్యారెక్టర్ ని అద్భుతంగా చేస్తాడు. పవన్ చేస్తే కచ్చితంగా బాగుంటుంది. కానీ చరణ్ తో చేయాలని రాసి ఉంది, చరణ్ కి కుదిరింది చేశాము” అని అన్నారు.