Chiranjeevi : టికెట్ రేట్లు పెంచమని ప్రభుత్వాలని అడిగితే తప్పులేదు

రెండు రాష్ట్రాలలో టిక్కెట్ రెట్లు పెంచడంపై చిరంజీవి మాట్లాడుతూ.. ''కరోనాతో అన్ని రంగాలు కుంటుపడ్డాయి. ప్రపంచంలో అన్ని రంగాలు నష్టపోయినట్టు సినిమా రంగం కూడా.............

Chiranjeevi : టికెట్ రేట్లు పెంచమని ప్రభుత్వాలని అడిగితే తప్పులేదు

Acharya (1)

Chiranjeevi :  ఇటీవల ఏపీలో టికెట్ల సమస్య ఉండగా చిరంజీవి ముందుండి సమస్య పరిష్కరించిన సంగతి తెలిసిందే. ఇక ఆ తర్వాత నుంచి తెలంగాణలో, ఏపీలో పెద్ద సినిమాలకి టికెట్ రేట్లని పెంచుతున్నారు. అయితే భారీ సినిమాలకి భారీగా టికెట్ రేట్లు పెంచడంతో మరీ ఇంత పెంచడం అన్యాయం అంటూ కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. ఇటీవల రిలీజైన భారీ సినిమాలన్నిటికీ తెలంగాణ, ఏపీలో టికెట్ ధరలు పెంచారు. ప్రస్తుతం రాబోతున్న ఆచార్య సినిమాకి కూడా టికెట్ ధరని పెంచుకోవచ్చు అంటూ రెండు రాష్ట్రాలలోను అనుమతి ఇచ్చారు.

 

అయితే తాజాగా ఈ టికెట్ ధరల పెంపుపై చిరంజీవి కెమెంట్స్ చేశారు. ప్రస్తుతం చిరంజీవి ఆచార్య మూవీ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు. ఈ ప్రమోషన్స్ లో భాగంగా ఇవాళ హైదరాబాద్ లోని పార్క్ హయత్ హోటల్ లో ఆచార్య టీం ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ ప్రెస్ మీట్ లో విలేఖరులు అడిగిన పలు ప్రశ్నలకి చిరంజీవి, ఆచార్య టీం సమాధానాలు ఇచ్చారు. ఇందులో భాగంగా ఓ విలేఖరి టికెట్ రేట్లు పెంచడం గురించి ప్రశ్నించగా చిరంజీవి దానికి సమాధానమిచ్చారు.

Suma Kanakala : అవును నాకు, రాజీవ్‌కి చాలా గొడవలు అయ్యాయి.. విడాకులు అనేవి..

రెండు రాష్ట్రాలలో టిక్కెట్ రెట్లు పెంచడంపై చిరంజీవి మాట్లాడుతూ.. ”కరోనాతో అన్ని రంగాలు కుంటుపడ్డాయి. ప్రపంచంలో అన్ని రంగాలు నష్టపోయినట్టు సినిమా రంగం కూడా చాలా నష్టపోయింది. అందరికంటే ఎక్కువగా మేము భారీ టాక్స్ లు కడుతున్నాము. కరోనా వల్ల షూటింగ్స్ సకాలంలో పూర్తికాక, సినిమాలు టైంకి రిలీజ్ అవ్వక ఇంట్రెస్ట్ లు పెరిగి బడ్జెట్ కూడా పెరిగింది. అందుకే టిక్కెట్ రేటు గురించి ప్రభుత్వాల దగ్గర వేడుకుంటే తప్పులేదు. ప్రభుత్వాలు అన్ని ఆలోచించి టికెట్ రేటుని థియేటర్ బట్టి, బడ్జెట్ ని బట్టి పెంచుకునే వెసలుబాటు కల్పిస్తుంది” అని అన్నారు.