కాలంతోపాటు మనుషులు కూడా మారుతుంటారని అంటుంటారు. కాలం మారినా.. దేశం మారినా తమలో ఎలాంటి మార్పు లేదని అంటున్నారు మెగాస్టార్ చిరంజీవి. ఒకప్పటి మధురమైన జ్ఞాపకాలను చిరు దంపతులు గుర్తుచేసుకున్నారు. సరిగ్గా 30 ఏళ్ల క్రితం అమెరికా ట్రిప్ వెళ్లిన సమయంలో తన భార్య సురేఖతో కలిసి సరదాగా తీసిన ఫొటోను ఆయన షేర్ చేశారు. ఇప్పుడు లాక్ డౌన్ సమయంలో అదే మాదిరిగా తీసిన ఫొటోను ఆయన పాత ఫొటోకు జతచేసి అభిమానులతో పంచుకున్నారు చిరు. 1990లో అమెరికాలో హాలీడేస్ సందర్భంగా కుటుంబంతో ఆనందంగా గడిపారు. ఇప్పుడు 2020లోనూ కరోనా జైల్ ఫుల్ హాలీడేస్ గడేపిస్తున్నానని చిరంజీవి తెలిపారు. ఈ పోస్టుకు ‘నేను.. కాలం మారినా.. దేశం మారినా… ’ అని క్యాప్షన్ పెట్టారు.
అప్పటి ఫొటోలో వంట చేస్తూ చిరు ఎలా కనిపించారో.. 30ఏళ్ల తర్వాత తీసిన ఇప్పటి ఫొటోలోనూ అచ్చం అలానే ఫొజిచ్చారు చిరు దంపతులు. అలాంటి దుస్తులే ధరించారు. చిరు తన రెండు చేతుల్లో గరెట పట్టుకుని వంట చేస్తుండగా.. భార్య సురేఖ స్టీల్ డబ్బా పట్టుకుని వెనుక వైపు నిలబడినట్టుగా ఉన్నారు. ఇప్పుడు అదే మాదిరిగా అదే ఫోజులో చిరు దంపతులు చూడచక్కగా కనిపించారు.
ప్రస్తుతం ఈ రెండు ఫొటోలు సోషల్ మీడియాలో చిరు అభిమానులను ఆకట్టుకుంటోంది. చిరు కుటంబ సభ్యులతో పాటు నెటిజన్లు ఆదర్శ దంపతులంటూ కామెంట్లు పెట్టారు. సైరా నరసింహారెడ్డి మూవీ తర్వాత చిరంజీవి ఆచార్య అనే మూవీలో నటిస్తున్నారు. దీనికి కొరటాల శివ డైరెక్షన్ చేస్తున్నారు. లాక్ డౌన్ కారణంగా ఈ సినిమా షూటింగ్ వాయిదా పడింది. లాక్ డౌన్ ఎత్తేశాక.. మళ్లీ షూటింగ్ మొదలయ్యే ఛాన్స్ ఉంది.
Read: నిజమైన లీడర్ అంటే పవన్ కళ్యాణే : పవర్ స్టార్ పై ప్రగ్యా ప్రశంసలు