Chiranjeevi and Nagababu Interesting Comments on Pawan Kalyan in Womens Day Mega Special Interview
Chiranjeevi – Pawan Kalyan : నేడు ఉమెన్స్ డే సందర్భంగా చిరంజీవి తల్లి అంజనమ్మతో చిరంజీవి, నాగబాబు, మాధవి, విజయ దుర్గ.. లతో స్పెషల్ ఇంటర్వ్యూ చేసారు. ఈ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలు తెలిపారు. అయితే ఈ ఇంటర్వ్యూకి పవన్ కళ్యాణ్ హాజరు కాలేదు. పవన్ గురించి కూడా టాపిక్ రాగా మెగాస్టార్ చిరంజీవి, నాగబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు.
చిరంజీవి మాట్లాడుతూ.. మా అమ్మకు ఇంట్లో సపరేట్ కిచెన్ ఉంటుంది. ఎప్పుడన్నా సరదాగా తను వంట చేసి మాకు పెడుతుంది. ముఖ్యంగా కళ్యాణ్ బాబు వస్తే చేస్తుంది. వాడు బయట బాగా తిరిగి కష్టపడి వచ్చాడని స్పెషల్ గా చేసి పెడుతుంది. ఇక్కడ మేము గొడ్డులాగా కష్టపడి పని చేసినా వాడు చేసేది టీవీల్లో ఎక్కువ చూపించేసరికి ఆ రాజకీయాల్లో, ఎండల్లో తిరగడం చూసి అమ్మ వాడికి మరింత స్పెషల్ గా చేసి పెడుతుంది. వాడికి బిర్యానీ అంటే ఇష్టం అని వండుతుంది. కళ్యాణ్ ఎప్పుడు ఎక్కడున్నాడో ఎవరికీ తెలియకపోయినా అమ్మకు మాత్రం తెలుస్తుంది అని అన్నారు.
Also Read : Chiranjeevi : నా చెల్లి మరణం ఇప్పటికీ గుర్తుంది.. మా నాన్న లేకుండానే కార్యక్రమాలు.. మెగాస్టార్ ఎమోషనల్..
అలాగే నాగబాబు కూడా మాట్లాడుతూ.. చిన్నప్పుడు కళ్యాణ్ బాబు ఏది వద్దనేవాడు, ఏది సరిగ్గా తినేవాడు కాదు. అన్నయ్య ఏదున్నా అడ్జస్ట్ అవుతాడు. నాకు నచ్చకపోతే గొడవ పెట్టేవాడిని. నాకు వెజిటేరియన్ ఎలర్జీ. కళ్యాణ్ బాబు ఇష్టమైన ఫుడ్ ఉంటే తినేవాడు. లేకపోతే సైలెంట్ గా వద్దు అని వెళ్ళిపోతాడు. అందుకే మా అమ్మ వాడ్ని స్పెషల్ కేర్ చూసేది. చిన్నప్పుడు అంత బలంగా ఉండేవాడు కాదు. మా అమ్మ ఫోకస్ ఎక్కువ కళ్యాణ్ మీదే అని తెలిపారు. దీంతో మెగా బ్రదర్స్ ఇద్దరూ పవన్ కళ్యాణ్ గురించి చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.
మెగా ఫ్యామిలీ ఉమెన్స్ డే స్పెషల్ ఫుల్ ఇంటర్వ్యూ ఇక్కడ చూసేయండి..