Chiranjeevi : నా చెల్లి మరణం ఇప్పటికీ గుర్తుంది.. మా నాన్న లేకుండానే కార్యక్రమాలు.. మెగాస్టార్ ఎమోషనల్..
నేడు ఉమెన్స్ డే సందర్భంగా చిరంజీవి తల్లి అంజనమ్మ, చిరంజీవి, నాగబాబు, మాధవి, విజయ దుర్గ.. లతో స్పెషల్ ఇంటర్వ్యూ చేసారు.

Chiranjeevi got Emotional while speaking about his sister Death
Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి మొత్తం అయిదుగురు తోబుట్టువులు అని అందరికి తెలిసిందే. చిరంజీవి, మాధవి, విజయ దుర్గ, నాగబాబు, పవన్ కళ్యాణ్.. అని అందరికి తెలిసిందే. అయితే నేడు చిరంజీవి తన తోబుట్టువుల గురించి ఓ ఆసక్తికర విషయాన్ని చెప్తూ ఎమోషనల్ అయ్యాడు.
నేడు ఉమెన్స్ డే సందర్భంగా చిరంజీవి తల్లి అంజనమ్మ, చిరంజీవి, నాగబాబు, మాధవి, విజయ దుర్గ.. లతో స్పెషల్ ఇంటర్వ్యూ చేసారు. ఈ ఇంటర్వ్యూలో అందరూ పలు ఆసక్తికర విషయాలు తెలిపారు.
Also Read : 3 Roses Season 2 Teaser : 3 రోజెస్ సీజన్ 2 టీజర్ వచ్చేసింది.. నవ్వులే నవ్వులు..
ఈ క్రమంలో చిరంజీవి మాట్లాడుతూ.. మా అమ్మకు అయిదుగురు ఉన్నాం. కానీ పురిట్లో ఒకరు, ఒక సంవత్సరం, రెండేళ్లు పెరిగి ఇద్దరు చనిపోయారు. నాకు ఆరేళ్ళు ఉన్నప్పుడు రమా అనే రెండేళ్ల మా చెల్లి చనిపోయింది. బ్రెయిన్ ఫ్లూ వస్తే గవర్నమెంట్ హాస్పిటల్ లో చేర్పించాం. కొన్ని రోజులకు చనిపోయింది. మా నాన్న పోలీస్ కావడంతో క్యాంప్ లకు కూడా వెళ్లేవారు డ్యూటీ వేస్తే. తను చనిపోయినప్పుడు మా నాన్న క్యాంప్ లోనే ఉన్నారు. అమ్మ ఆ శవాన్ని ఎత్తుకొని రిక్షాలో ఇంటికి తీసుకురావడం నాకు ఇప్పటికి గుర్తు ఉంది. నాన్న లేరు. ఏం చేయాలో, ఆయనకు ఎలా ఇన్ఫోర్మ్ చేయాలో తెలీదు. అలాంటి పరిస్థితుల్లో చుట్టూ ఉండే పక్కవాళ్ళు అన్ని కార్యక్రమాలు నిర్వహించారు. డిపార్ట్మెంట్ వాళ్ళను పట్టుకొని నాన్నకు ఇన్ఫర్మేషన్ ఎలాగోలా తెలియచేసాము. కానీ నాన్న వచ్చేసరికి అన్ని కార్యక్రమాలు అయిపోయాయి అంటూ ఎమోషనల్ అయ్యారు మెగాస్టార్.
ఫుల్ ఇంటర్వ్యూ ఇక్కడ చూసేయండి..