Chiranjeevi : సలార్ టీంకి చిరంజీవి అభినందనలు.. మై డియర్ ప్రభాస్..

సలార్ టీంకి చిరంజీవి అభినందనలు తెలియజేస్తూ ట్వీట్ చేశారు. మై డియర్ ప్రభాస్ కి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. సలార్ సినిమాతో..

Chiranjeevi appreciation tweet to Prabhas and Salaar movie team for success

Chiranjeevi – Salaar : ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా తెరకెక్కిన చిత్రం ‘సలార్’. రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో పృథ్వీరాజ్ సుకుమారన్, జగపతిబాబు విలన్స్ గా నటిస్తే శృతిహాసన్, శ్రియారెడ్డి, ఈశ్వరరావు, టీంను ఆనంద్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. ఈ మూవీ మొదటి భాగం సీజ్ ఫైర్.. నిన్న శుక్రవారం గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది. ప్రభాస్ నుంచి చాలా కాలం తరువాత ఒక మాస్ బొమ్మ వస్తుండడం, దానికి ప్రశాంత్ నీల్ దర్శకుడు కావడంతో మూవీ పై భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి.

దీంతో అభిమానులతో పాటు సెలబ్రిటీస్ లో సైతం ఆసక్తి క్రియేట్ అయ్యింది. నిఖిల్, శ్రీవిష్ణు వంటి హీరోలు, పలువురు దర్శకనిర్మాతలు బెనిఫిట్ షోలు చూసి ప్రభాస్ మాస్ ని ఎంజాయ్ చేశారు. ఇండియా వైడ్ ఈ సినిమాకి సూపర్ హిట్ టాక్ వస్తుంది. దీంతో ప్రభాస్ అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఇక ఈ మూవీకి సక్సెస్ టాక్ రావడంతో.. మెగాస్టార్ చిరంజీవి సలార్ టీంని అభినందిస్తూ ఒక ట్వీట్ చేశారు.

“మై డియర్ ప్రభాస్ కి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. సలార్ సినిమాతో బాక్స్ ఆఫీస్ ని తగలబెట్టేస్తున్నాను. ఇలాంటి ఒక బ్లాక్ బస్టర్ అందించిన ప్రశాంత్ నీల్ కి అభినందనలు. అలాగే పృథ్వీరాజ్ సుకుమారన్, శృతిహాసన్, జగపతిబాబుకి నా ప్రేమని తెలియజేస్తున్నాను. ఈ చిత్రానికి పని చేసిన ప్రతి టెక్నీషియన్ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. హోంబలే ఫిలింస్ సలార్ తో మారో బ్లాక్ బస్టర్ ని అందుకున్నారు” అంటూ చిరంజీవి ట్వీట్ చేశారు.

Also read : Ram Charan : వరల్డ్ టాప్ మ్యాగజైన్‌ ఫోర్బ్స్ ఇండియాలో రామ్ చరణ్ ఉపాసన..

ఇక చిరంజీవి ట్వీట్ కి మూవీ టీం ఒక్కొక్కరిగా రెస్పాండ్ అవుతూ చిరంజీవికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. కాగా సలార్ సినిమా మొదటిరోజు ఇండియా వైడ్ దాదాపు 89 కోట్ల వరకు గ్రాస్ అందుకున్నట్లు సమాచారం. ఇక వరల్డ్ వైడ్ గా ఈ చిత్రం దాదాపు 175 కోట్ల గ్రాస్ ని అందుకుందని చెబుతున్నారు. అయితే మూవీ టీం నుంచి అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రావాల్సి ఉంది.