Chiranjeevi : అమితాబ్ బచ్చన్ KBC షోలో చిరంజీవి ఎంట్రీ.. వీడియో చూశారా..?

అమితాబ్ బచ్చన్.. కౌన్ బనేగా క్రోర్‌పతి షో చేస్తున్న సమయంలో చిరంజీవి ఎంట్రీ ఇచ్చి బిగ్ బిని ఆశ్చర్య పరిచాడు.

Chiranjeevi : అమితాబ్ బచ్చన్ KBC షోలో చిరంజీవి ఎంట్రీ.. వీడియో చూశారా..?

Chiranjeevi at Amitabh Bachchan Kaun Banega Crorepati show

Chiranjeevi – Amitabh Bachchan : ఇండియన్ సినిమా ఇండస్ట్రీలోని ఇద్దరు మెగాస్టార్స్ చిరంజీవి, అమితాబ్ బచ్చన్ ఒక స్క్రీన్ పై కనిపిస్తే అది సంచలనం అనే చెప్పాలి. వీరిద్దరూ కలిసి ‘సైరా’ సినిమాలో నటించి.. ఆడియన్స్ ని థ్రిల్ చేశారు. తాజాగా ఇప్పుడు వీరిద్దరూ కలిసి మళ్ళీ స్క్రీన్ పై కనిపించారు. అయితే ఈసారి బిగ్ స్క్రీన్ మీద కాదు స్మాల్ స్క్రీన్ మీద. అమితాబ్ బచ్చన్ హిందీలో ‘కౌన్ బనేగా క్రోర్‌పతి’ (KBC) షో చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ షోలోనే చిరంజీవి ఎంట్రీ ఇచ్చాడు. ఇప్పుడు అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

నేడు (అక్టోబర్ 11) అమితాబ్ పుట్టినరోజు కావడంతో ప్రతి ఒక్కరు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈక్రమంలోనే చిరంజీవి కూడా సోషల్ మీడియా ద్వారా తెలియజేశాడు. అయితే చిరంజీవి అక్కడితో ఆగలేదు. అమితాబ్ బచ్చన్.. కౌన్ బనేగా క్రోర్‌పతి షో చేస్తున్న సమయంలో చిరంజీవి వర్చ్యువల్ గా ఎంట్రీ ఇచ్చి బిగ్ బిని ఆశ్చర్య పరిచాడు. చిరు సర్‌ప్రైజ్ చేసి విషెస్ చెప్పడంతో అమితాబ్ హ్యాపీ ఫీల్ అయ్యి.. థాంక్యూ చెప్పాడు. పక్కపక్కన కాకున్నా ఇద్దరు మెగాస్టార్స్ ఇలా ఒకే స్క్రీన్ పై కనిపించడంతో అభిమానులు ఆ వీడియోని వైరల్ చేస్తున్నారు.

Also read : Game Changer : గేమ్ చెంజర్‌ని హ్యాండిల్ చేయలేనని.. స్టోరీ వదులుకున్న స్టార్ డైరెక్టర్.. ఎవరు అతను..?

ఇక చిరంజీవి సినిమాలు విషయానికి వస్తే.. ప్రస్తుతం తన 157వ సినిమాని పట్టాలు ఎక్కించే ప్రయత్నంలో ఉన్నాడు. ఈ మూవీకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. ఈ మూవీ సోషియో ఫాంటసీ డ్రామాతో ఆడియన్స్ ముందుకు రాబోతుంది. చిరంజీవి ఏజ్ కి తగ్గ పాత్రతో ఈ సినిమాలో కనిపించబోతున్నాడని దర్శకుడు తెలియజేశాడు. నవంబర్ లో ఈ మూవీ సెట్స్ పైకి వెళ్లనుందని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది. యూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ మూవీ వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.