Chiranjeevi Balakrishna : ‘ఇంద్రసేనా రెడ్డి’తో ‘చెన్నకేశవ రెడ్డి’.. పాత ఫొటో వైరల్..

చిరంజీవి - బాలకృష్ణ కలిసి ఉండగా ఇంద్ర సినిమా షూటింగ్ లో దిగిన ఫొటో వైరల్ గా మారింది. (Chiranjeevi Balakrishna)

Chiranjeevi Balakrishna

Chiranjeevi Balakrishna : మన హీరోలు అందరూ ఒక్కటిగా ఉన్నా కొంతమంది ఫ్యాన్స్ మాత్రం మా హీరో గొప్ప అంటే మా హీరో గొప్ప అని ఫ్యాన్ వార్స్ చేసుకుంటారు. అందుకే స్టార్ హీరోలు కలిసి ఉన్న ఫొటోలు, వీడియోలు బయటకు వస్తే కనీసం ఫ్యాన్ వార్స్ కొంతైనా తగ్గుతాయని పలువురు భావిస్తారు. ఒకప్పుడు చిరంజీవి – బాలయ్య ఫ్యాన్స్ గొడవలు ఎక్కువగా ఉండేవి.(Chiranjeevi Balakrishna)

అయితే తాజాగా ఇంద్ర సినిమా షూటింగ్ సమయంలో తీసిన ఓ ఫొటో వైరల్ అవ్వడంతో అప్పుడు కూడా వాళ్లంతా ఒకటే అనే సంకేతం ఇస్తున్నారు. చిరంజీవి కెరీర్లో చేసిన ఒకే ఒక్క ఫ్యాక్షన్ సినిమా ఇంద్ర. మెగాస్టార్ ఇండస్ట్రీ హిట్ సినిమాల్లో ఇంద్ర ఒకటి. 2002 లో వచ్చిన ఇంద్ర సినిమా ఎంతటి ప్రభంజనాన్ని సృష్టించిందో అందరికి తెలిసిందే.

Also See : Priya shetty : బిగ్ బాస్ లోకి కామన్ గర్ల్ గా ఎంట్రీ ఇచ్చిన ప్రియా శెట్టి.. ఫొటోలు..

ఆ సినిమా షూటింగ్ కి ఓ సారి బాలకృష్ణ కూడా వచ్చారు. బాలకృష్ణ, చిరంజీవి, ఇంద్ర నిర్మాత అశ్వినీదత్ ముగ్గురు కూర్చొని సరదాగా కబుర్లు చెప్పుకుంటున్న ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ఫొటోలో చిరంజీవి ఇంద్ర గెటప్ లోనే ఉన్నారు.

ఇక బాలయ్య కూడా చెన్నకేశవరెడ్డి, సమరసింహా రెడ్డి, నరసింహ నాయుడు, సీమా సింహం.. లాంటి అనేక ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ సినిమాలు తీసి మెప్పించిన సంగతి తెలిసిందే.