Chiranjeevi Birthday
Chiranjeevi Birthday : నేడు మెగాస్టార్ చిరంజీవి 70వ పుట్టిన రోజు. అభిమానులు, ప్రముఖులు అంతా చిరుకి సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అయితే చిరంజీవి తన 70వ పుట్టిన రోజు వేడుకలను సెలబ్రేట్ చేసుకోడానికి తన ఫ్యామిలీతో కలిసి గోవా వెళ్లిన సంగతి తెలిసిందే. గోవాలో మెగాస్టార్ బర్త్ డే ని ఫ్యామిలీ మెంబర్స్ ఘనంగా సెలబ్రేట్ చేస్తున్నారు.(Chiranjeevi Birthday)
ఈ క్రమంలో రామ్ చరణ్ ఓ స్పెషల్ వీడియో షేర్ చేసి తండ్రికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ వీడియోలో చరణ్ తండ్రికి కేక్ తినిపించి, చిరు కాళ్లకు మొక్కి ఆశీర్వాదం తీసుకున్నాడు. అనంతరం ఇద్దరూ ఆప్యాయంగా కౌగలించుకున్నారు. చిరు కూడా చరణ్ కి కేక్ తినిపించారు.
చరణ్ ఈ వీడియో షేర్ చేసి.. ఇది కేవలం నీ పుట్టిన రోజు మాత్రమే కాదు నాన్న. ఇది మీలాంటి వ్యక్తికి ఒక అద్భుతమైన వేడుక. నా హీరో, నా గైడ్, నా ప్రేరణ మీరే. నేను సాధించిన ప్రతి విజయం, నేను మోసే ప్రతి విలువ, మీ నుండే వస్తుంది. 70 ఏళ్ల వయసులో మీరు హృదయంలో ఇంకా యవ్వనంగా, ఇంకా స్ఫూర్తిదాయకంగా మారుతున్నారు. మీ ఆరోగ్యం, ఆనందం ఎన్నో సంవత్సరాలు ఇలాగె ఉండాలని నేను ప్రార్థిస్తున్నాను. ఎవరైనా కోరుకునే ఉత్తమ తండ్రిగా ఉన్నందుకు ధన్యవాదాలు అని తెలిపాడు. దీంతో చరణ్ పోస్ట్ వైరల్ గా మారగా మెగా ఫ్యాన్స్ ఈ తండ్రి కొడుకుల వీడియోని షేర్ చేస్తున్నారు.
Also Read : Chiranjeevi Movie : చిరంజీవి బర్త్ డే రోజు రిలీజయిన మెగాస్టార్ ఏకైక సినిమా ఏంటో తెలుసా? కల్ట్ క్లాసిక్..