Chiranjeevi Birthday Special: కమల్‌హాసన్-రజనీకాంత్ కలిస్తే చిరంజీవి-కే.బాలచందర్

Chiranjeevi Birthday Special: కమల్‌హాసన్-రజనీకాంత్ కలిస్తే చిరంజీవి-కే.బాలచందర్

Updated On : August 22, 2020 / 4:24 PM IST

తెలుగు సినీ పరిశ్రమకు మెగా స్టార్… శనివారంతో 65వ సంవత్సరంలోకి అడుగుపెట్టేశారు. వినాయక చవితి రోజునే బర్త్ డే జరుపుకుంటుండటంతో మరింత స్పెషల్ గా మారింది. కొణిదెల శివ శంకర వరప్రసాద్ అనే వ్యక్తి.. మధ్య తరగతి కుటుంబం నుంచి నర్సాపూర్ లో డిగ్రీ పొంది.. 1976లో మద్రాస్ సినీ పరిశ్రమలో అడుగుపెట్టారు. ఆరంభంలో కఠినంగా శ్రమించి యాక్టింగ్ లో ప్లాట్ ఫాం ఏర్పరచుకున్నారు.



బ్రిలియంట్ కామిక్ టైమింగ్, అద్భుతమైన డైలాగ్ డెలివరీ, ట్రెమండస్ యాక్టింగ్ సైల్, డ్యాన్సింగ్ స్కిల్స్ చిరంజీవిని టాప్ కు చేర్చాయి. టాలీవుడ్ లో డ్యాన్స్ కు క్రేజ్ తీసుకొచ్చింది కూడా ఆయనే. తర్వాతి జనరేషన్ మొత్తం డ్యాన్స్ పై ఫోకస్ పెట్టేలా చేసింది. ఫోక్, బ్రేక్, క్లాసికల్, డిస్కో ఇలా ఎలాంటి డ్యాన్స్ అయినా సరే.. కొత్త జనరేషన్లు నేర్చుకోకతప్పలేదు.

ఓ చరిత్ర సృష్టించి రాజకీయాల్లోకి వెళ్లిపోయిన చిరంజీవి.. మళ్లీ 2017లో ఇండస్ట్రీలోకి యూటర్న్ తీసుకున్నారు. యాక్టింగ్ డ్రామా ఖైదీ నెం.150 తర్వాత 2019లో ఉయ్యాలవాడ నరసింహారెడ్డితో ఇండస్ట్రీ గ్రాండ్ వెల్ కమ్ చెప్పింది. వయస్సుకు సంబంధం లేకుండా హీరో రోల్ లో మెప్పించి మరోసారి మెగాస్టార్ అని నిరూపించుకున్నారు.



అతని ట్రావెలింగ్ తో పాటే తమ్ముళ్లు నాగబాబు, పవన్ కళ్యాణ్ లను ఇండస్ట్రీకి పరిచయం చేశాడు. తర్వాతి జనరేషన్ కు రామ్ చరణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, కళ్యాణ్ దేవ్, అల్లు అర్జున్, అల్లు శిరీశ్, పంజా వైష్ణవ్ తేజ్, నిహారిక కొణిదెల అంతా చిరు వారసులే. ఇక ఆయన ప్రొఫెషనల్ కెరీర్ గురించి అందరికీ కొందరికి మాత్రమే తెలిసిన విషయాలు.

1992లో బ్లాక్ బ్లాస్టర్ సినిమా ఘరానా మొగుడు.. టాలీవుడ్ లో రూ.10కోట్లకు మించి వసూలు చేసిన మొదటిసినిమా. నగ్మా, వాణి విశ్వనాథ్ లీడింగ్ రోల్స్ లో కనిపించారు. 1993లో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ మెయిన్ స్ట్రీమ్ సెక్షన్ లోనూ స్థానం దక్కించుకుంది. 1986లో రిలీజ్ అయిన కన్నడ సినిమా అనురాగ అరాలితుకు రీమేక్ ను రాఘవేంద్ర రావు దర్శకత్వం వహించారు.

సౌత్ ఇండస్ట్రీ నుంచి 59వ అకాడమీ అవార్డు(ఆస్కార్)కు ఎంపికైన తొలి యాక్టర్. ఈ కార్యక్రమం కాలిఫోర్నియాలోని లాస్ ఏంజిల్స్ లో జరిగింది.

ఇండియా యాక్టర్లలో రూ.7కోట్ల రెమ్యూనరేషన్ తీసుకున్న తొలి సూపర్ స్టార్ చిరంజీవినే(ఇంద్ర). 2001 స్పోర్ట్స్ డ్రామా లగాన్ సినిమాకు అమీర్ ఖాన్ తీసుకుంది రూ.6కోట్లు మాత్రమే.




చిరంజీవి 1987 సోషల్ డ్రామా స్వయంకృషితో విశ్వనాథ్.కే డైరక్షన్ లో అద్భుతమైన సినిమాలో నటించారు. దీనిని రష్యాలో డబ్బింగ్ చేసి మాస్కో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లో చోటు దక్కించుకుంది. ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా, ఆసియా ఫసిఫిక్ ఫిల్మ్ ఫెస్టివల్ కార్యక్రమాల్లో ఇన్‌స్పైరింగ్‌ సినిమాగా నిలిచింది.

ఆపద్భాందవుడు సినిమాకు రూ.1.25కోట్లు రెమ్యూనరేషన్ తీసుకుని 1992లోనే టాప్ అనిపించుకున్నాడు. ఆ సమయంలో చిరంజీవిని బచ్చన్ కంటే గొప్పవాడంటూ పాపులర్ మ్యాగజైన్స్ కవర్ పేజి మీద రాసుకొచ్చాయి.



1990-1999 కాలంలో చాలా మందిపై ప్రభావం చూపించిన మెగాస్టార్ ఓ హాలీవుడ్ ప్రాజెక్టుపై కూడా సంతకం పెట్టారు. దురదృష్టవశాత్తు ద రిటర్న్ ఆఫ్ ద తీఫ్ ఆఫ్ బాగ్దాద్ మధ్యలోనే ఆగిపోయింది. లెజండరీ ఫిల్మ్ మేకర్ కే బాలచందర్ మాట్లాడుతూ..చిరంజీవిలో కమల్ హాసన్, రజనీకాంత్ కలిసి ఉన్నారు. యాక్షన్ ఒక్కటే కాదు అతను నటనలోనూ టాప్ యే అని అన్నారు.