HBD Pawan Kalyan: నిప్పు కణం కళ్యాణ్.. తమ్ముడికి చిరు శుభాకాంక్షలు!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బర్త్ డే వేడుకలు మొదలయ్యాయి. గత వారం రోజుల నుండే ఆయన అభిమానులు సందడి మొదలుపెట్టగా నిన్న రాత్రి నుండే సోషల్ మీడియాలో పవన్ కు శుభాకాంక్షల వెల్లువ మొదలైంది.

HBD Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బర్త్ డే వేడుకలు మొదలయ్యాయి. గత వారం రోజుల నుండే ఆయన అభిమానులు సందడి మొదలుపెట్టగా నిన్న రాత్రి నుండే సోషల్ మీడియాలో పవన్ కు శుభాకాంక్షల వెల్లువ మొదలైంది. ఇప్పటికే పలువురు సెలబ్రిటీలు పవన్ తో అనుబంధాన్ని నెమరువేసుకుంటూ ఆయనకు శుభాకాంక్షలు తెలపగా మెగాస్టార్ చిరంజీవి కూడా తమ్ముడిపై ప్రేమను తెలియజేసేలా శుభాకాంక్షలు చెప్పాడు. నిప్పుకణం కళ్యాణ్ అంటూ సమాజం మీద పవన్ అభిప్రాయాన్ని తెలిపేలా చిరు ట్వీట్ చేశాడు.

చిరు ట్వీట్ చేస్తూ.. ‘చిన్నప్పటి నుంచి సమాజం గురించే కళ్యాణ్ ప్రతి ఆలోచన… ప్రతి అడుగు. పదిమందికి మేలు జరగాలని ప్రతి క్షణం పరితపించే నిప్పు కణం…కళ్యాణ్. అతని లక్ష్యం నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, తోడబుట్టిన ఆశయానికి పుట్టిన రోజు శుభాకాంక్షలు’ అంటూ మెగాస్టార్ ట్వీట్ చేశారు. చిరంజీవితో పాటు తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్ కూడా పవన్ కి విషెస్ చెప్పారు. సౌందర్‌రాజన్ ప్రతి సంవత్సరం పవన్ కు ప్రత్యేకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ ఉంటారు.

‘శ్రీ కె పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. మీరు ఆయురారోగ్యాలతో.. ఎల్లప్పుడూ ప్రజలకు సేవలందించాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను’ అంటూ సోషల్ మీడియాలో ఒక మెసేజ్ పోస్ట్ చేశారు. ఇక పవన్ అభిమానులు, జనసేన కార్యకర్తలు, ఫాలోవర్లు నేడు పలు సేవా కార్యక్రమాలు చేస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు