Chiranjeevi
Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి ప్రతి సంవత్సరం తన తల్లి పుట్టిన రోజులు ఘనంగా జరుపుతారు. తమ్ముళ్లు పవన్ కళ్యాణ్, నాగబాబులతో పాటు చెల్లిళ్లతో కలిసి ఆమె ఆశీస్సులు తీసుకుంటారు. చిరంజీవి తల్లి పుట్టిన రోజుని సెలబ్రేట్ చేసి ఆ ఫోటోలని సోషల్ మీడియాలో కూడా షేర్ చేస్తారు. అయితే ఈ సారి చిరంజీవికి కరోనా సోకడంతో తన తల్లి పుట్టినరోజును సెలబ్రేట్ చెయ్యట్లేదు. దీంతో బాధపడిన చిరంజీవి ఎమోషనల్ గా ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.
Shyam Singharoy : నాని సరికొత్త రికార్డు.. నెట్‌ఫ్లిక్స్ వరల్డ్ టాప్ 3లో ‘శ్యామ్ సింగరాయ్’
చిరంజీవి తన ట్విట్టర్ లో భార్య సురేఖతో పాటు తల్లి తో ఉన్న ఫోటోని షేర్ చేసి.. అమ్మా ! జన్మదిన శుభాకాంక్షలు.. క్వారెంటైన్ అయిన కారణంగా నీ ఆశీస్సులు ప్రత్యక్షంగా తీసుకోలేక ఇలా తెలుపుతున్నా. నీ చల్లని దీవెనలు ఈ జన్మకే కాదు మరు జన్మలకి కూడా కావాలని ఆ భగవంతుడ్ని కోరుకొంటూ.. అభినందనలతో…. శంకరబాబు” అని పోస్ట్ చేశారు. దీంతో అభిమానులు కూడా ఎమోషనల్ అవుతున్నారు. మెగా బ్రదర్ నాగబాబు కూడా ఇంస్టాగ్రామ్ లో తన తల్లితో ఉన్న వీడియోని షేర్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
అమ్మా !??
జన్మదిన శుభాకాంక్షలు ??క్వరెంటైన్ అయిన కారణంగా నీ ఆశీస్సులు ప్రత్యక్షంగా తీసుకోలేక ఇలా తెలుపుతున్నా..
నీ చల్లని దీవెనలు ఈ జన్మకే కాదు మరు జన్మలకి కూడా కావాలని ఆ భగవంతుడ్ని కోరుకొంటూ ?
అభినందనలతో …. శంకరబాబు pic.twitter.com/DF6FS1eP3p
— Chiranjeevi Konidela (@KChiruTweets) January 29, 2022