Chiranjeevi comments on Movie with Pawan Kalyan
Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి, శృతి హాసన్ జంటగా డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో తెరకెక్కుతున్న సినిమా వాల్తేరు వీరయ్య. ఈ సినిమాలో రవితేజ ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు. ఇప్పటికే రిలీజ్ చేసిన గ్లింప్స్, సాంగ్స్ తో సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి. చిరంజీవి మరింత యంగ్ గా, మరింత ఎనర్జీగా కనిపిస్తుండం, మాస్ ఎలిమెంట్స్ ఎక్కువగా ఉండటంతో సినిమాపై రోజు రోజుకి అంచనాలు పెరుగుతున్నాయి.
తాజాగా వాల్తేరు వీరయ్య చిత్ర యూనిట్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ ప్రెస్ మీట్ కి చిరంజీవి, రవితేజ, ఊర్వశి రౌతేలా, డైరెక్టర్ బాబీ, దేవిశ్రీ ప్రసాద్, రాజేంద్రప్రసాద్, నిర్మాతలు.. చిత్రయూనిట్ అంతా విచ్చేసి మాట్లాడారు. ఈ ప్రెస్ మీట్ లో పలువురు మేడి సవాళ్లు చిత్ర యూనిట్ ని ప్రశ్నలు అడగగా వారు సమాధానాలు చెప్పారు.
Aadi Sai Kumar : హీరో ఆది సాయి కుమార్ స్పెషల్ ఇంటర్వ్యూ.. ‘టాప్ గేర్’ సినిమా డిసెంబర్ 30న విడుదల..
ఈ నేపథ్యంలో ఓ విలేఖరి ప్రస్తుతం రవితేజతో సినిమా తీశారు. వేరే హీరోలతో చేస్తారా? పవన్ కళ్యాణ్ తో సినిమా ఎప్పుడు చేస్తారు అని అడగగా దానికి చిరంజీవి సమాధానమిస్తూ.. ఏ హీరోతో అయినా కలిసి సినిమా చేయడానికి నేను రెడీ. ఇక పవన్ కళ్యాణ్ అంటే అతనికి ఖాళీ లేదు. ప్రస్తుతం పవన్ కి ఉన్న కమిట్మెంట్స్ తో చాలా బిజీగా ఉన్నాడు. అతని చేతిలో ఉన్న సినిమాలే ఇంకా అవ్వలేదు. అవన్నీ అవ్వడానికి కనీసం రెండేళ్లు పడుతుందేమో. ఆ తర్వాత చూద్దాం అని అన్నారు. ఇక వాల్తేరు వీరయ్య సినిమా సంక్రాంతికి జనవరి 13న రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే.