Chiranjeevi Comments On Working Again With Ram Charan
Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ఆయన నటించిన లేటెస్ట్ మూవీ ‘గాడ్‌ఫాదర్’ చిత్ర ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నారు. వరుసగా ఈ సినిమాను ప్రమోట్ చేస్తూ, పలు ఇంటర్వ్యూలు ఇస్తూ మీడియాతో ముచ్చటిస్తున్నారు. అయితే ఈ క్రమంలోనే చిరంజీవి మెగా ఫ్యాన్స్‌కు ఓ షాకింగ్ విషయాన్ని చెప్పుకొచ్చారు.
చరణ్‌తో చిరు తిరిగి ఎప్పుడు కలిసి నటిస్తారని ఓ మీడియా వారు అడగగా.. చిరు దానికి ఎవరూ ఊహించని సమాధానం చెప్పారు. చరణ్‌తో కలిసి చిరు చేసిన తొలి సినిమా ‘ఆచార్య’ బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ మూవీగా నిలిచిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో దర్శకుడు చెప్పినట్లుగా చరణ్, తాను నటించామని.. అయితే ఈ సినిమా ఆడియెన్స్‌కు మాత్రం కనెక్ట్ కాలేకపోయిందని చిరు చెప్పుకొచ్చారు. చరణ్‌తో కలిసి నటించిన తొలి సినిమా ఇలా ఫ్లాప్‌గా మిగలడంతో, మళ్లీ తామిద్దరం కలిసి అంత ఎగ్జైట్‌మెంట్‌తో సినిమా చేయలేము అని చిరు తెలిపారు.
Chiranjeevi: తన వల్లే ఆ హీరో అలా అయ్యాడంటోన్న చిరంజీవి!
దీంతో భవిష్యత్తులో చరణ్‌తో కలిసి మరోసారి సినిమా చేయకపోవచ్చని చిరు అనడంతో అభిమానులు అవాక్కవుతున్నారు. అయితే మంచి కంటెంట్ ఉన్న సినిమా పడితే ఆడియెన్స్ ఖచ్చితంగా ఆదరిస్తారని అభిమానులు అంటున్నారు. మరి చిరు చరణ్ ఒకే సినిమాలో మళ్లీ ఎప్పుడు కలిసి నటిస్తారో చూడాలి.