Chiranjeevi : నేనొప్పుడొచ్చినా ఈ సీమ నేల తడుస్తుంది.. రామ్ చరణ్ చెప్తేనే ఈ సినిమా చేశా.. వర్షంలోనూ మెగాస్టార్ స్పీచ్

ఈ ఈవెంట్లో చిరంజీవి మాట్లాడుతూ..‘‘నేను ఎప్పుడు రాయలసీమకు వచ్చినా ఈ నేల తడుస్తుంది. గతంలో రాజకీయ ప్రచారానికి, ఇంద్ర సినిమా సమయంలో కూడా ఇదే జరిగింది. ఇప్పుడు కూడా ఇదే జరుగుతుంది.

Chiranjeevi : నేనొప్పుడొచ్చినా ఈ సీమ నేల తడుస్తుంది.. రామ్ చరణ్ చెప్తేనే ఈ సినిమా చేశా.. వర్షంలోనూ మెగాస్టార్ స్పీచ్

Chiranjeevi :  మలయాళంలో సూపర్ హిట్ సినిమా లూసిఫర్ ని తెలుగు గాడ్‌ఫాదర్‌ గా చిరంజీవి రీమేక్ చేస్తున్నారు. మోహనరాజా దర్శకత్వంలో సూపర్ గుడ్ ఫిలిమ్స్ బ్యానర్ పై ఈ సినిమాని నిర్మిస్తున్నారు. నయనతార, సల్మాన్‌ఖాన్, సత్యదేవ్, పూరి జగన్నాథ్‌ ఈ సినిమాలో ముఖ్య పాత్రలు పోషించారు. దసరా కానుకగా ఈ సినిమా అక్టోబరు 5న రిలీజ్‌ కానుంది. తాజాగా బుధవారం నాడు అనంతపురంలో గాడ్ ఫాదర్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ వేడుకని నిర్వహించారు.

ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుగుతుండగా వర్షం పడింది. అయినా చిరంజీవి వర్షాన్ని కూడా లెక్కచేయకుండా ఎంతో ఎమోషనల్ గా మాట్లాడారు. అభిమానులు కూడా వర్షంలో తడుస్తూ అంతే ఉత్సాహాన్ని చూపించారు.

ఈ ఈవెంట్లో చిరంజీవి మాట్లాడుతూ..‘‘నేను ఎప్పుడు రాయలసీమకు వచ్చినా ఈ నేల తడుస్తుంది. గతంలో రాజకీయ ప్రచారానికి, ఇంద్ర సినిమా సమయంలో కూడా ఇదే జరిగింది. ఇప్పుడు కూడా ఇదే జరుగుతుంది. వరుణ దేవుడు మనల్ని కరుణిస్తున్నాడు. ఇవాళ కూడా వర్షం పడటం శుభ పరిణామంగా అనిపిస్తోంది.”

”గాడ్‌ఫాదర్‌ సినిమా మలయాళ హిట్‌ మూవీ ‘లూసిఫర్‌’ రీమేక్. ఈ సినిమా చేయడానికి ముఖ్య కారణం రామ్ చరణ్. రామ్ చరణ్ ఈ సినిమా చూసి నా ఏజ్ కి, ఈ సమయంలో ఇలాంటి కథలు బాగా సెట్ అవుతాయని చేయమన్నాడు. అందుకే ఈ సినిమా చరణ్ కోసం చేస్తున్నాను. ఇక నాపై ఉన్న నమ్మకం, ప్రేమ, గౌరవంతో ‘గాడ్‌ఫాదర్‌’ కథ వినకుండానే సల్మాన్ ఖాన్ ఇందులో నటించడానికి ఒప్పుకున్నాడు. తెలుగువారికి జాతీయ అవార్డులు రావడం చాలా అరుదు. అలాంటిది చిన్న వయసులోనే జాతీయ అవార్డు సాధించిన తమన్‌కు అభినందనలు.”

”గాడ్‌ఫాదర్‌ సినిమా బాగా వచ్చింది. నేను సిసినిమా చూశాను. ఇది కచ్చితంగా ప్రేక్షకులని అలరిస్తుంది. మా సినిమాతో పాటు విడుదలవుతున్న నా మిత్రుడు నాగార్జున ‘ది ఘోస్ట్‌’, యువ హీరో గణేష్‌ ‘స్వాతిముత్యం’ సినిమాలు కూడా మంచి విజయం సాధించాలి. ఈ మధ్యకాలంలో పరిశ్రమలో కాస్త స్తబ్ధత ఏర్పడింది. జయాపజయాలు మన చేతుల్లో ఉండవని తెలుసు కానీ ప్రేక్షకులని అలరించలేకపోయాం అనే ఓ బాధ ఉంది. దానికి సమాధానమే ఈ సినిమా. ‘గాడ్‌ఫాదర్‌’ సినిమా కచ్చితంగా ఒక నిశ్శబ్ధ విస్ఫోటనం అవుతుంది. నాకు ఇండస్ట్రీలో గాడ్‌ఫాదర్స్ ఎవరూ లేరు. నాకు నా అభిమానులే గాడ్ ఫాదర్స్”

BiggBoss 6 Day 24 : ఓ వైపు కెప్టెన్సీ టాస్కులు.. మరోవైపు అర్ధరాత్రి బెడ్ పై కంటెస్టెంట్స్ ఏం చేశారో తెలుసా??

”ఇవాళ బుధవారం ఉదయం ఓ విషాదం చోటు చేసుకుంది. సూపర్‌స్టార్‌ కృష్ణ గారి సతీమణి, సోదరుడు మహేశ్‌బాబుగారి మాతృమూర్తి ఇందిరాదేవిగారు మృతిచెందారు. ఆ కుటుంబం విషాదంలో ఉంది. వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలి” అంటూ ఎమోషనల్ గా మాట్లాడారు. వర్షంలో చిరంజీవి తడుస్తూ మాట్లాడటం, మధ్యలో సత్యదేవ్ చిరంజీవికి గొడుగు పట్టడం, అభిమానులు కూడా వర్షంలో తడవడం.. ఇవన్నీ ఈవెంట్ కి హైలెట్ గా నిలిచాయి.