Chiranjeevi : జవాన్ టైటిల్ ట్రాక్‌కి చిరంజీవి స్టెప్పులు.. ఫొటోల్లో ఫ్యాన్స్ కనిపెట్టిన కొన్ని క్రేజీ విషయాలు..

జవాన్ టైటిల్ ట్రాక్‌కి చిరంజీవి అదిరే స్టెప్పులు వేసిన వీడియో వైరల్ అవుతుంది. దీంతో పాటు మహేష్ బాబు, రామ్ చరణ్ ఫ్రెండ్‌షిప్ లెవెల్..

Chiranjeevi dance for Shah Rukh Khan Jawan Title track

Chiranjeevi : ఇటీవల చిరంజీవి ఇంట దివాళీ బ్యాష్ జరిగిన సంగతి అందరికి తెలిసిందే. ఆ సెలబ్రేషన్స్ లో ఇండస్ట్రీలోని టాప్ స్టార్స్ అంతా హాజరయ్యి సందడి చేశారు. రామ్ చరణ్, ఉపాసన నిర్వహించిన ఈ ఫంక్షన్ లో వెంకటేష్, నాగార్జున, మహేష్ బాబు, అల్లు అర్జున్, ఎన్టీఆర్.. ఇలా అగ్ర తారలంతా ఒకే చోట చేరి అభిమానులకు కన్నుల విందు ఇచ్చారు. ప్రస్తుతం ఆ సెలబ్రేషన్స్ కి సంబంధించిన ఫోటోలు, వీడియోలు ఒక్కొక్కటిగా బయటకి వస్తూ ఉన్నాయి. ఈక్రమంలోనే తాజాగా ఒక వీడియో బయటకి వచ్చింది.

ఇక ఆ వీడియోలో చిరు షారుఖ్ ఖాన్ రీసెంట్ బ్లాక్ బస్టర్ మూవీ జవాన్ టైటిల్ ట్రాక్ కి అదిరే స్టెప్పులు వేస్తూ కనిపించారు. మెగాస్టార్ డాన్స్ వేస్తుంటే మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ చప్పట్లు ఎంజాయ్ చేస్తూ కనిపించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మెగా అభిమానులు ఈ వీడియోని ఎక్స్ (X) ట్విట్టర్ లో షేర్ చేస్తూ షారుఖ్ ని ట్యాగ్ చేస్తూ వస్తున్నారు. మరి షారుఖ్ పాటకి చిరు వేసిన ఆ స్టెప్పులు వైపు మీరుకూడా ఒక లుక్ వేసేయండి.

Also read : Children’s Day 2024 : టాలీవుడ్ స్టార్స్ చైల్డ్‌హుడ్ ఫోటోలు షేర్ చేసిన కల్కి డైరెక్టర్.. ప్రభాస్ టు కమల్..

కాగా ఈ ఫంక్షన్స్ నుంచి వచ్చిన కొన్ని ఫొటోల్లో కొన్ని క్రేజీ విషయాలను అభిమానులు కనిపెట్టారు. రామ్ చరణ్ ఒక సందర్భంలో కాళ్ళకి ధరించిన చెప్పులను, మహేష్ బాబు మరో సందర్భంలో ధరించి కనిపించడంతో.. ఫ్యాన్స్ ఈ విషయాన్ని హైలైట్ చేస్తూ వస్తున్నారు. వీరిద్దరూ ఒకరి చెప్పులను ఒకరు మార్చుకునేంత క్లోజ్ ఫ్రెండ్సా..? అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ వస్తున్నారు. అలాగే మహేష్ సేమ్ డిజైన్ టీ-షర్ట్ ని డిఫరెంట్ కలర్స్ లో వేసుకోవడం, స్క్రీన్ పగిలిపోయిన ఫోన్ ఉపయోగిస్తున్న వెంకటేష్.. ఇలాంటి విషయాలను కొందరు ఫ్యాన్స్ కనిపెట్టి అందరికి తెలియజేస్తున్నారు. ఇక వీటిపై మీమర్స్ మీమ్స్ చేస్తూ వస్తున్నారు.