Chiranjeevi
Chiranjeevi : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సినీ పరిశ్రమలోకి వచ్చి నేటికి 18 ఏళ్ళు పూర్తయింది. మెగాస్టార్ తనయుడిగా రామ్ చరణ్ మొదటి సినిమా చిరుత తో 2007 సెప్టెంబర్ 28న ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అప్పట్నుంచి మెగా పవర్ స్టార్ గా ఎదిగి ఇప్పుడు గ్లోబల్ స్టార్ గా మారి ఎంతోమంది అభిమంబుల్ని సంపాదించుకున్నాడు. నటన, డ్యాన్స్ లలో తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నాడు.(Chiranjeevi)
రామ్ చరణ్ సినీ పరిశ్రమలోకి వచ్చి 18 ఏళ్ళు అవడంతో మెగా ఫ్యాన్స్ శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ క్రమంలో మెగాస్టార్ చిరంజీవి తన కొడుకుపై స్పెషల్ పోస్ట్ చేసారు.
Also Read : Thaman: మహేష్ ఫ్యాన్స్ అలా అనడం చాలా బాధేసింది.. డార్క్ రూమ్ లో ఏడ్చాను.. తమన్ ఎమోషనల్ కామెంట్స్
చిరంజీవి తన ట్వీట్ లో.. చరణ్ బాబు, 18 ఏళ్ల క్రితం ‘చిరుత’తో మొదలైన నీ సినీ ప్రయాణం, నేడు కోట్లాది అభిమానుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచినందుకు ఎంతగానో సంతోషిస్తున్నాను. నిన్ను తెరపై హీరోగా చూసిన ఆ క్షణం.. నాన్నగా నేను ఎప్పటికీ మరచిపోలేను. నీ క్రమశిక్షణ, కృషి, పట్టుదల, వినయం, అంకితభావం నిన్ను ఇండస్ట్రీలో మరింత ప్రత్యేకంగా నిలబెట్టాయి. తండ్రిగా నేను నిన్ను చూసి ఎప్పుడు గర్వపడుతుంటా.. తెలుగు ప్రేక్షకుల అభిమానంతో, దేవుని దీవెనలతో మరెన్నో శిఖరాలు నువ్వు అధిరోహించాలి అని కోరుకుంటూ..విజయోస్తు… అని రాసుకొచ్చారు. దీంతో తనయుడిపై చిరంజీవి గర్వంతో రాసిన ఈ మాటలను మెగా ఫ్యాన్స్ వైరల్ చేస్తున్నారు.
చరణ్ బాబు,
18 ఏళ్ల క్రితం ‘చిరుత’తో మొదలైన నీ సినీ ప్రయాణం, నేడు కోట్లాది అభిమానుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచినందుకు ఎంతగానో సంతోషిస్తున్నాను.
నిన్ను తెరపై హీరోగా చూసిన ఆ క్షణం.. నాన్నగా నేను ఎప్పటికీ మరచిపోలేను. నీ క్రమశిక్షణ, కృషి, పట్టుదల, వినయం, అంకితభావం నిన్ను… https://t.co/ovp9cINzfq
— Chiranjeevi Konidela (@KChiruTweets) September 28, 2025
Also Read : Ram Charan: రామ్ చరణ్ 18 ఇయర్స్ ఇన్ ఇండస్ట్రీ.. పెద్ది నుంచి స్పెషల్ పోస్టర్