Ram Charan: రామ్ చరణ్ 18 ఇయర్స్ ఇన్ ఇండస్ట్రీ.. పెద్ది నుంచి స్పెషల్ పోస్టర్

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్.. ప్రస్తతం టాలీవుడ్ ఇండస్ట్రీలో(Ram Charan) టాప్ స్టార్. చిరంజీవి తనయుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఆయన తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని క్రియేట్ చేసుకున్నాడు.

Ram Charan: రామ్ చరణ్ 18 ఇయర్స్ ఇన్ ఇండస్ట్రీ.. పెద్ది నుంచి స్పెషల్ పోస్టర్

Ram Charan completes 18 years in the Tollywood industry

Updated On : September 28, 2025 / 12:25 PM IST

Ram Charan: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్.. ప్రస్తతం టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ స్టార్. చిరంజీవి తనయుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఆయన తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని క్రియేట్ చేసుకున్నాడు. తండ్రుకి తగ్గ తనయుడు అనే రేంజ్ నుంచి తండ్రిని మించిన తనయుడు అనే స్థాయికి ఎదిగాడు రామ్ చరణ్. తాజాగా ఆయన తెలుగు సినిమా ఇండస్ట్రీలో 18 ఏళ్ళ ప్రయాణాన్ని కంప్లీట్ చేసుకున్నాడు. ఈ సందర్బంగా ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ పెద్ది సినిమా నుంచి స్పెషల్ పోస్టర్ విడుదల చేశారు. నోటిలో బీడీ, వెనుక బ్యాగ్, ఆ బ్యాగులో బ్యాటు పెట్టుకొని రైలు పట్టాలపై ఉన్న ఈ పోస్టర్ మాస్ ప్రేక్షకులను ఒక రేంజ్ (Ram Charan)లో ఆకట్టుకుంటోంది.

Lenin: అబ్బా సాయి రామ్.. హీరోయిన్ ని మార్చేశారు.. అక్కినేని ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ

ఇక రా అండ్ రస్టిక్ లుక్ లో రామ్ చరణ్ ఒక రేంజ్ లో కనిపిస్తున్నాడు. ఇప్పటికే పెద్ది సినిమాపై భారీ అంచనాలు ఉండగా.. ఈ పోస్టర్ ఆ అంచనాలను రెట్టింపు చేస్తోంది. ఇక పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కుతున్న పెద్ది సినిమాను ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబు సనా తెరకెక్కిస్తున్నాడు. వ్రిద్ది సినిమాస్, మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నయి. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా..ఆస్కార్ విజేత ఏఆర్ రహమాన్ సంగీతం అందిస్తున్నాడు. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా 2026 మర్చి 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ సినిమా రామ్ చరణ్ కు మెమరబుల్ మూవీగా మిగులుతుందా అనేది చూడాలి.

 

View this post on Instagram

 

A post shared by Vriddhi Cinemas (@vriddhicinemas)