Lenin: అబ్బా సాయి రామ్.. హీరోయిన్ ని మార్చేశారు.. అక్కినేని ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ
అక్కినేని అఖిల్.. పాపం బ్యాడ్ లక్ అంటే ఈ కుర్ర హేరోదు అని చెప్పాలి. అక్కినేని(Lenin) లాంటి స్ట్రాంగ్ బ్యాక్ గ్రౌండ్ ఉన్నప్పటికి ఒక్కటంటే.. ఒక్క హిట్టు కూడా కొట్టలేకపోయాడు అఖిల్.

Makers change heroine from Akkineni Akhil Lenin movie
Lenin: అక్కినేని అఖిల్.. పాపం బ్యాడ్ లక్ అంటే ఈ కుర్ర హేరోదు అని చెప్పాలి. అక్కినేని లాంటి స్ట్రాంగ్ బ్యాక్ గ్రౌండ్ ఉన్నప్పటికి ఒక్కటంటే.. ఒక్క హిట్టు కూడా కొట్టలేకపోయాడు అఖిల్. మొదటి సినిమా అఖిల్ నుంచి మొన్నొచ్చిన ఏజెంట్ వరకు అన్ని డిజాస్టర్సే. (Lenin)మధ్యలో వచ్చిన ఒక్క మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచురల్ సినిమా తప్ప. ఫ్యామిలీ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమా డీసెంట్ హిట్ గా నిలిచింది. అయితే, ఏజెంట్ డిజాస్టర్ తరువాత చాలా గ్యాప్ తీసుకున్న ఈ హీరో రీసెంట్ గా లెనిన్ సినిమాను మొదలుపెట్టాడు.
Raja Saab Trailer: రెబల్ స్టార్ ఫ్యాన్స్ గెట్ రెడీ.. రాజా సాబ్ ట్రైలర్ డేట్ వచ్చేసింది
సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై వస్తున్న ఈ సినిమాను కిషోర్ కుమార్ అబ్బుర తెరకెక్కిస్తున్నాడు. రా అండ్ రస్టిక్ బ్యాక్డ్రాప్ లో వస్తున్న ఈ సినిమా నుంచి అఖిల్ పుట్టినరోజు సందర్బంగా టీజర్ విడుదల చేశారు మేకర్స్. ఆ టీజర్ కి ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. రస్టిక్ లుక్ లో అఖిల్ కూడా చాలా కొత్తగా కనిపించాడు. కాబట్టి, ఈ సినిమాతో అఖిల్ స్ట్రాంగ్ కంబ్యాక్ ఇస్తాడని అందరు అనుకున్నారు. కానీ, ఒకే ఒక్క విషయంలో మాత్రం అక్కినేని ఫ్యాన్స్ తో పాటు నార్మల్ ఆడియన్స్ కూడా డిజప్పాయింట్ అయ్యారు. అదేంటంటే, ఈ సినిమాలో హీరోయిన్ గా శ్రీలీలను తీసుకోవడం.
శ్రీలీల నటించిన దాదాపు అన్ని సినిమాలు ప్లాప్ అవుతూ వస్తున్నాయి. మధ్యలో వచ్చిన ఒక్క భగవంత్ కేసరి తప్పా అన్ని డిజాస్టర్ టాక్ ను తెచ్చుకున్నాయి. అందుకే, అఖిల్ ఎంతో ప్రెస్టీజియస్ గా తీసుకోని చేస్తున్న ఈ సినిమా శ్రీలీలను తీసుకోవడం ఎందుకు చాలా మంది డిజప్పాయింట్ అయ్యారు. ఆ న్యూస్ సోషల్ మీడియాలో కూడా తెగ ట్రెండ్ చేశారు. మరి ఈ న్యూస్ లెనిన్ మేకర్స్ వరకు చేరిందో తెలియదు కానీ, తాజాగా ఈ సినిమా నుంచి శ్రీలీలను తప్పించారట. ఆమె ప్లేస్ లో మిస్టర్ బచ్చన్ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే ను తీసుకున్నారట. ఈ న్యూస్ బయటకు రావడంతో అక్కినేని ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. తప్పకుండా ఈ సినిమా హిట్ అవుతుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక లెనిన్ విషయానికి వస్తే, ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా వచ్చే ఏడాది సమ్మర్ కి ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.