Chinranjeevi: రామ్ చరణ్ కంటికి సర్జరీ.. చిరు ఎమోషనల్ పోస్ట్ వైరల్
పెద్ది షూటింగ్ ప్రమాదంలో రామ్ చరణ్ కంటికి చిన్న సర్జరీ జరిగింది అంటూ పోస్ట్ పెట్టిన చిరంజీవి(Chiranjeevi).
- V Santhosh Kumar
- Published On : March 26, 2026 / 01:38 PM IST
Chiranjeevi Emotional post Regarding Ram Charan Eye Surgery
- పెద్ది షూటింగ్ లో ప్రమాదం
- రామ్ చరణ్ కంటికి గాయం
- చిన్న సర్జరీ జరిగింది అంటూ చిరు పోస్ట్
Chinranjeevi; మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ‘పెద్ది’ సినిమా షూటింగ్‌లో గాయపడిన వార్త మెగా అభిమానులను కలవరానికి గురిచేసింది. హైదరాబాద్‌లో జరుగుతున్న చిత్రీకరణ సమయంలో చరణ్ కంటికి గాయం అయ్యింది. దీంతో, చరణ్ కంటికి చిన్నపాటి సర్జరీ జరిగినట్లు మెగాస్టార్ చిరంజీవి స్వయంగా సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ‘ఈ క్లిష్ట సమయంలో చరణ్ కనురెప్పకు అత్యంత నైపుణ్యంతో చికిత్స అందించిన వైద్య బృందానికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు. మొదట మాలో కొంత ఆందోళన నెలకొన్నప్పటికీ, వైద్యుల భరోసా ధైర్యాన్ని ఇచ్చింది. ప్రస్తుతం అంతా సవ్యంగానే ఉంది’ అంటూ రాసుకొచ్చాడు చిరంజీవి(Chinranjeevi).
Peddi: ‘పెద్ది’ రిలీజ్ పై మళ్ళీ మొదలైన టెన్షన్.. ఓవర్సీస్ బుకింగ్స్ వాయిదా.. అనుకున్నదే అయిందిగా!
ఇక స్వయంగా మెగాస్టార్ నుంచి రామ్ చరణ్ హెల్త్ అప్‌డేట్ రావడంతో ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ మెగా ఫ్యాన్స్ సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెడుతున్నారు. ఇక బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘పెద్ది’ చిత్రం ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో శివరాజ్‌కుమార్, జగపతిబాబు స్టార్ నటిస్తున్నారు. గాయం కారణంగా చిన్న విరామం తీసుకున్నప్పటికీ, ఏప్రిల్ 30న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే లక్ష్యంతో చిత్ర యూనిట్ పనిచేస్తోంది.
Dr. Sudhakar Prasad garu,
Your timely and skilful surgery on Charan’s eyelid has truly been a blessing. What was a moment of concern for us was eased entirely by your precision, care, and expertise.Your craftsmanship made all the difference, and we are truly grateful.
Thank… pic.twitter.com/j53rRIpOKB— Chiranjeevi Konidela (@KChiruTweets) March 26, 2026
