Chiranjeevi Jovial With Pooja Hegde In Acharya Press Meet
Acharya: టాలీవుడ్‌లో ప్రస్తుతం వరుసగా సినిమాలు రిలీజ్ అవుతూ సందడి చేస్తున్నాయి. ఇప్పటికే పలు భారీ చిత్రాలు, పాన్ ఇండియా చిత్రాలు బాక్సాఫీస్ వద్ద తమ సత్తా చాటగా, మరికొన్ని పరాజయం పాలయ్యాయి. అయితే తెలుగు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మూవీ ‘ఆచార్య’ ఇప్పటికే అన్ని పనులు ముగించుకుని రిలీజ్‌కు రెడీగా ఉంది. ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తుండటంతో ఆచార్య చిత్రంపై అంచనాలు ఓ రేంజ్‌లో నెలకొన్నాయి.
Acharya : ‘ఆచార్య’కి ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్..
ఇక ఈ సినిమాను సక్సెస్‌ఫుల్ చిత్రాల దర్శకుడు కొరటాల శివ తెరకెక్కిస్తుండటం.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో నటిస్తుండటంతో మెగా ఫ్యాన్స్‌తో పాటు ప్రేక్షకుల్లోనూ ఆచార్య సినిమాపై భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. అటు ఆచార్య టీమ్ కూడా ఈ సినిమాను జనంలోకి తీసుకెళ్లేందుకు తీవ్రంగా కష్టపడుతోంది. ఇప్పటికే ప్రీరిలీజ్ ఈవెంట్‌ను గ్రాండ్‌గా నిర్వహించిన ఆచార్య టీమ్, తాజాగా మీడియా ఛానళ్ళతో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ క్రమంలో ఆచార్య చిత్రానికి సంబంధించి పలు ఆసక్తికరమైన విషయాలను చిరు అండ్ టీమ్ పంచుకున్నారు. ఇక ఈ కార్యక్రమంలో చిరంజీవి, రామ్ చరణ్, కొరటాల శివ, అందాల భామ పూజా హెగ్డేలు పాల్గొన్నారు.
Acharya: ఆచార్యకు ముందే చరణ్ కోసం కొరటాల కథ.. సెట్స్ మీదకు ఎప్పుడో?
అయితే ప్రెస్ మీట్ అనంతరం, ఫోటోలకు పోజులిచ్చే సమయంలో చిరు తన చిలిపితనాన్ని ప్రదర్శించారు. పూజా హెగ్డే చిరంజీవితో ఫోటోలకు పోజులిచ్చి వెళ్లిపోతుంటే.. ఆమెను వెనక్కి పట్టి పిలిచిన చిరు, ఆమెతో కామెడీ చేశారు. అప్పుడే వెళ్లిపోతావా అనేలా ఆమెను తనవైపుకు లాగారు. ఇక చిరు, పూజా హెగ్డే కలిసి ఫోటోలకు పోజులిస్తుంటే, చరణ్‌ను పక్కకు వెళ్లిపొమ్మంటూ చిరు చెప్పడంతో పూజా ఒక్కసారిగా నవ్వుకుంది. ఇలా చిరు చిలిపితనాన్ని తాను బాగా ఎంజాయ్ చేశానంటూ పూజా పేర్కొంది. దీనికి సంబంధించిన వీడియోను ఆమె తన సోషల్ మీడియా అకౌంట్‌లో షేర్ చేయడంతో, అది కాస్తా వైరల్‌గా మారింది. ఇక ఆచార్య సినిమాలో చరణ్‌కు జోడీగా నీలాంబరి అనే పాత్రలో పూజా నటిస్తున్న సంగతి తెలిసిందే.
? Sweetest and ever Jovial @KChiruTweets Garu ??? #Aacharya https://t.co/x2jKyntU8A
— Pooja Hegde (@hegdepooja) April 26, 2022