Chiranjeevi Godfather First Look Time Locked
Godfather: మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘గాడ్ ఫాదర్’ కోసం మెగా ఫ్యాన్స్ ఎంతో ఆతృతగా చూస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే ముగించుకోగా, పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఈ సినిమా బిజీగా ఉంది. ఇక చిరు తన నెక్ట్స్ ప్రాజెక్టుల షూటింగ్స్‌తో ఆయన కూడా బిజీగా మారిపోయారు. దీంతో గాడ్‌ఫాదర్ చిత్రం నుండి ఎలాంటి అప్‌డేట్ రావడం లేదని మెగా ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్న తరుణంలో, ఓ అదిరిపోయే అప్‌డేట్‌ను ఇచ్చింది చిత్ర యూనిట్.
Godfather: సల్మాన్‌తో కలిసి చిందులేసేందుకు రెడీ అవుతోన్న మెగాస్టార్..?
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మెగాస్టార్ చిరంజీవి గాడ్‌ఫాదర్ ఫస్ట్‌లుక్ పోస్టర్‌కు చిత్ర యూనిట్ డేట్ అండ్ టైమ్ ఫిక్స్ చేసింది. ‘ది గాడ్‌ఫాదర్ అరైవ్స్’ అంటూ ఓ ప్రీలుక్ పోస్టర్‌ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. ఓ కారు చుట్టూ గొడుగులు పట్టుకుని జనం నిలబడిన పోస్టర్‌తో అప్పుడే ఫస్ట్ లుక్ పోస్టర్‌పై అదిరిపోయే అంచనాలు క్రియేట్ చేశారు. ఇక ఈ సినిమాలో చిరు లుక్ ఎలా ఉండబోతుందా అని అందరూ అప్పుడే ఊహించుకుంటున్నారు.
Godfather: ఆగస్టు వార్.. సిద్ధమంటోన్న గాడ్‌ఫాదర్..?
కాగా.. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను జూలై 4న సాయంత్రం 5.45 గంటలకు రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ వెల్లడించింది. దీంతో మెగా ఫ్యాన్స్ అప్పుడే గాడ్‌ఫాదర్ మేనియాతో ఊగిపోతున్నారు. ఇక బాక్సాఫీస్‌ను షేక్ చేసేందుకు గాడ్‌ఫాదర్ వచ్చే సమయం ఆసన్నమైందని వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. కాగా ఈ సినిమాను పొలిటికల్ థ్రిల్లర్‌గా దర్శకుడు మోహన్ రాజా తెరకెక్కించగా, ఈ చిత్రానికి థమన్ సంగీతం అందించాడు. ఈ సినిమాలో నయనతార, సత్యదేవ్ ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తుండగా, బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ఓ కేమియో పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమాను ఆగస్టు నెలలో రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.
Make way for the MEGA Menacing Arrival of the #GodFather ??
First look on 4th July at 5:45 PM ?#GodFatherFirstLook ??
Mega? @KChiruTweets @BeingSalmanKhan @jayam_mohanraja #Nayanthara @MusicThaman @AlwaysRamCharan #RBChoudary @ProducerNVP @KonidelaPro @SuperGoodFilms_ pic.twitter.com/Ao7472vzs1
— Konidela Pro Company (@KonidelaPro) July 1, 2022