×
Ad

Bandla Ganesh : పవన్ కళ్యాణ్ జీవితమిస్తే…చిరంజీవి ప్రాణం పోశారు

చిరంజీవి లేకపోతే..తాను ప్రాణాలతో ఉండేవాడిని కాదని, చనిపోయేవాడినని చెప్పారు నిర్మాత బండ్ల గణేష్. పవన్ కళ్యాణ్ తనకు ఒక జీవితాన్ని ఇస్తే...మెగాస్టార్ చిరంజీవి ప్రాణం పోశారని తెలిపారు

  • Published On : August 25, 2021 / 11:53 AM IST

Chiru

Bandla Ganesh Emotional Comments : చిరంజీవి లేకపోతే..తాను ప్రాణాలతో ఉండేవాడిని కాదని, చనిపోయేవాడినని చెప్పారు నిర్మాత బండ్ల గణేష్. పవన్ కళ్యాణ్ తనకు ఒక జీవితాన్ని ఇస్తే…మెగాస్టార్ చిరంజీవి ప్రాణం పోశారని తెలిపారు. ఓ ఇంటర్వ్యూలో ఆయన సంచలన విషయాలు వెల్లడించారు. కరోనా సమయంలో తనకు చిరంజీవి ఎలాంటి హెల్ప్ చేశారో తెలియచేశారు బండ్ల గణేష్. తనకు రెండోసారి కరోనా సోకిందని, ఈ సమయంలో చాలా ఇబ్బందులు పడడం జరిగిందన్నారు.

Read More : Yoga on Beach: బీచ్‍‌లో యోగా చేస్తున్న మహిళను కొరికిన సముద్ర జీవి

తన ఆరోగ్యం బాగా క్షీణించిందని, 80 శాతం ఊపిరితిత్తులు పాడైపోయాయన్నారు. తనకే కాకుండా..కుటుంబం మొత్తానికి కరోనా సోకడంతో చాలా భయమేసిందన్నారు. ఈ సమయంలో…హాస్పిటల్ బెడ్స్ కోసం తాను చాలా ప్రయత్నాలు చేసినట్లు, పెద్ద పెద్ద వారితో మాట్లాడినా ఫలితం కనిపించలేదన్నారు. ఈ సమయంలో పవన్ కళ్యాణ్ కు ఫోన్ చేద్దామని అనుకున్నా…ఈ సమయంలో ఆయన కూడా కరోనా వ్యాధితో బాధ పడుతుండడంతో ఆ పని చేయలేకపోయానన్నారు. ఇక వేరే ఆప్షన్ లేక..చిరంజీవి కాల్ చేసినట్లు, వెంటనే ఆయన రెస్పాండ్ అయి బెడ్ ఏర్పాటు చేసి ప్రాణాలు కాపాడారన్నారు. ఈ రోజు అందరి ముందు ఇలా ఉన్నానంటే..దీనికి కారణం…చిరంజీవి అని బండ్ల గణేష్ ఒకింత భావోద్వేగంతో తెలిపారు బండ్ల గణేష్.

Read More : Prakash Raj: కొడుకు కోసం భార్యను మళ్లీ పెళ్లి చేసుకున్న ప్రకాష్ రాజ్

ఇక బండ్ల గణేష్ విషయానికి వస్తే..ఆయన గతంలో కమెడియన్ గా నటించారు. నిర్మాతగా కూడా అలరించారు. ఇప్పుడు హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నారు. కొత్త దర్శకుడు వెంకట్ చంద్ర…ఓ చిత్రం తెరకెక్కిస్తున్నారు. ఇందులో బండ్ల హీరోగా నటిస్తున్నారు. సెప్టెంబర్ ఫస్ట్ వీక్ లో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. ఆయన స్పీచ్, ఇంటర్వ్యూలలో మాట్లాడే విషయాలు వైరల్ అవుతుంటాయి. పవన్ కళ్యాణ్ అంటే వీరాభిమానం. సినిమాలు, ఇతరత్రా విషయాలు సోషల్ మీడియాలో పంచుకుంటుంటారు.