Yoga on Beach: బీచ్‍‌లో యోగా చేస్తున్న మహిళను కొరికిన సముద్ర జీవి

బీచ్‌లో యోగా ప్రాక్టీస్ చేస్తున్న మహిళను కొరికేసింది ఇగువానా (తొండ లాంటి జీవి). వెనక్కు తిరిగి ఒక చేయిని కిందకు పెట్టి మరో చేతిని నేలకు ఆనించి విల్లులా వంగి ధనురాసనం వేసే ప్రయత్నం.

Yoga on Beach: బీచ్‍‌లో యోగా చేస్తున్న మహిళను కొరికిన సముద్ర జీవి

Beach Biting Iguana

Updated On : August 25, 2021 / 11:25 AM IST

Yoga on Beach: బీచ్‌లో యోగా ప్రాక్టీస్ చేస్తున్న మహిళను కొరికేసింది ఇగువానా (తొండ లాంటి జీవి). వెనక్కు తిరిగి ఒక చేయిని కిందకు పెట్టి మరో చేతిని నేలకు ఆనించి విల్లులా వంగి ధనురాసనం వేసే ప్రయత్నంలో ఉంది. ఇంతలో గాలిలోనే ఉన్న మరో చేయిని ఎగిరే ప్రయత్నం చేసింది ఇగువానా (Iguana). ఆ క్రమంలో కాస్త కొరికింది కూడా.

సరదా కోసం బీచ్ కు వచ్చి ఏదో ప్రయత్నం చేసిన మహిళ.. తన వేలు ఓ జీవి కొరికేసిందంటూ ట్విట్టర్ లో వీడియో పోస్టు చేశారు.

‘ఇవాళ నన్ను ఇగువానా కొరికిందని @bahamahoopyogi అనే యూజర్ పోస్టు చేశారు. 35లక్షల మందికి పైగా వీడియోను చూశారు. ఆ తర్వాత తానే ట్వీట్ చేస్తూ.. ఆ బీచ్ లో ఇగువానాలు చాలా ఉన్నాయి. మీరు కూడా అక్కడకు వెళ్లి వాటికి ఆహారం వేస్తూ ఉండండి’ అంటూ ట్వీట్ చేశారు.

ఇగువానాలు సాధారణంగా హాని తలపెట్టవు. ఒకవేళ అవి కొరికితే ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశాలు ఎక్కువ. ఈ వీడియో చూసిన యూజర్లు.. మహిళ చేతి వేళ్లకు ఏం రంగు ఉందని అడుగుతుంటే.. యోగా గురువు మీద జంతువు దాడి చేసిందంటూ కామెంట్ చేస్తున్నారు.

వీడియోలో మాత్రం ఆ మహిళను జీవి కొరకగానే వెనక్కు తిరిగి ఇసుకతో ఏదో శపించినట్లుగా విసురుతూ ఉంది. ఆ తర్వాత కాసేపటికి తనను కరిచిందంటూ నవ్వుకుంటూ కనిపించింది.