Prakash Raj: కొడుకు కోసం భార్యను మళ్లీ పెళ్లి చేసుకున్న ప్రకాష్ రాజ్

తన విలక్షణ నటనతో దక్షిణాదిలో పేరు తెచ్చుకుని, బాలీవుడ్‌లో కూడా తన సత్తా ఛాటుకున్న నటుడు ప్రకాష్ రాజ్.

Prakash Raj: కొడుకు కోసం భార్యను మళ్లీ పెళ్లి చేసుకున్న ప్రకాష్ రాజ్

Prakash Raj

Prakash Raj: తన విలక్షణ నటనతో దక్షిణాదిలో పేరు తెచ్చుకుని, బాలీవుడ్‌లో కూడా తన సత్తా ఛాటుకున్న నటుడు ప్రకాష్ రాజ్. తన నటనతో మైమరిపించిన ప్రకాష్ రాజ్.. ఎంత బిజీగా ఉన్నా కూడా తన కుటుంబంతో క్వాలిటీ టైమ్‌ గడుపుతూ ఉంటారు. లేటెస్ట్‌గా ప్రకాష్ రాజ్ తన కొడుకు వేదాంత్ కోరిక మేరకు మరోసారి పెళ్లి చేసుకున్నారు.

ఆగస్టు 24 తన పెళ్లి రోజు సందర్భంగా కొడుకు వేదాంత్ కోసం భార్య పోనీ వర్మను పెళ్లి చేసుకున్నారు ప్రకాష్ రాజ్. ఈ పెళ్లి సంబరానికి మొదటి భార్యతో తనకు కలిగిన సంతానం సైతం హాజరవడం విశేషం. దీనికి సంబంధించిన కొన్ని పిక్స్‌ను ప్రకాష్ రాజ్ తన అభిమానుల కోసం సోషల్ మీడియాలో పంచుకున్నారు. ప్రస్తుతం వైరల్‌గా మారిన ఈ ఫోటోలు చూసి అభినందనలు తెలుపుతున్నారు.

ప్రకాష్ రాజ్ 2009లో డిస్కోశాంతి సోదరి లలితకుమారిని పెళ్లి చేసుకోగా.. వీరికి ముగ్గురు పిల్లలు. ఇద్దరు అమ్మాయిలు, ఒక అబ్బాయి. అయితే అనారోగ్యంతో అబ్బాయి చనిపోగా.. మొదటి భార్య లలిత కుమారికి విడాకులు ఇచ్చిన తర్వాత కొరియోగ్రాఫర్‌ పోనీవర్మని ప్రకాశ్‌ రాజ్‌ 2010లో పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతం కే.జీ.యఫ్ చాప్టర్ 2, అల్లు అర్జున్‌ హీరోగా నటిస్తున్న పుష్ప వంటి పెద్ద సినిమాలతో బిజీ ఆర్టిస్ట్‌గా ఉంటూనే మా ఎన్నికల్లో సైతం పోటీ పడేందుకు సిద్ధం అవుతున్నారు ప్రకాష్ రాజ్.